Vitamin B12 importance: తరచూ అలసటగా ఉంటుందా, అశ్రద్ధ చేస్తే ప్రమాదకరం కావచ్చు

Vitamin B12 importance: ఆరోగ్యంగా, ఫిట్ అండ్ స్లిమ్‌గా ఉండాలంటే వివిధ రకాల పోషకాలు చాలా అవసరం. వీటిలో ఏది లోపించినా ఏదో ఒక సమస్య ఉత్పన్నమౌతుంటుంది. అందుకే శరీర నిర్మాణ, ఎదుగుదలలో పోషకాల అవసరం చాలా ఉంటుంది. ముఖ్యంగా కొన్ని పోషకాలు లోపిస్తే ఈ ప్రధాన సమస్యలు కన్పిస్తాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 11, 2024, 06:37 PM IST
Vitamin B12 importance: తరచూ అలసటగా ఉంటుందా, అశ్రద్ధ చేస్తే ప్రమాదకరం కావచ్చు

Vitamin B12 importance: కొంతమందికి తరచూ నీరసం లేదా అలసట ఎక్కువగా ఉండటాన్ని గమనించవచ్చు. అకారణంగా అలసట ఉంటుంది. ఒక్కోసారి నిద్రపోయినా అలసట పోదు. మీక్కూడా ఇదే పరిస్థితి ఉంటే కచ్చితంగా అది విటమిన్ బి12 లోపం కావచ్చు. విటమిన్ బి1 లోపాన్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదని వైద్యులు సూచిస్తుంటారు. 

కొన్ని లక్షణాలు సాధారణంగా, తేలిగ్గా కన్పించవచ్చు. అందుకే బహుశా చాలామంది వాటిని నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ వీటి వెనుక విటమిన్ లోపం ఉంటుంది. ఇదే చాలా కీలకమైంది. ముఖ్యంగా అకారణంగా అలసట రావడం అనే లక్షణాన్ని చాలా మంది తేలిగ్గా తీసుకుంటుంటారు. ఒక్కోసారి రోజంతా నీరసంగా , ఒత్తిడితో, బద్ధకంగా, అలసటగా ఉంటుంది. ఈ లక్షణాలు కన్పిస్తే నిర్లక్ష్యం వహించకూడదు. ఇది కచ్చితంగా విటమిన్ బి12 లోపం కావచ్చు. సకాలంలో తగిన చర్యలు తీసుకోకుంటే గంభీరమైన వ్యాధికి దారి తీయవచ్చు.

విటమిన్ బి12 లోపం లక్షణాలు

తరచూ నీరసం, బలహీనత ఉండటం, ఒత్తిడి, చర్మం పసుపుగా మారడం, నాలుక పూత, ఎర్రగా మారడం, నోటి పూత, మసకగా కన్పించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తలనొప్పి, చెవుల్లో రీ సౌండ్ రావడం, ఆకలి తగ్గడం వంటివి ప్రధాన లక్షణాలు.

విటమిన్ బి12 లోపిస్తే అది కాస్తా మెదడుపై ప్రభావం చూపిస్తుంది. విటమిన్ బి12 లోపం కారణంగా రెడ్ బ్లడ్ సెల్స్ తగ్గిపోతాయి. మతిమరపు పెరగవచ్చు. విపరీతమైన అలసట, నీరసం ఉంటాయి. ముఖ్యంగా ఎనర్జీ తక్కువగా ఉంటుంది.విటమిన్ బి12 లోపముంటే మెదడుపై ప్రతికూల ప్రభావం కారణగా జ్ఞాపకశక్తి మందగించవచ్చు. డిమెన్షియా ముప్పు పెరుగుతుంది. 

విటమిన్ బి12 లోపం కారణంగా శారీరక సమస్యలు పెరగవచ్చు. వివిధ రకాల మనసిక సమస్యలు కూడా తోడవుతాయి. విటమిన్ బి12 లోపముంటే ఎనీమియా, రక్త హీనత, హిమోగ్లోబిన్ తగ్గడం గమనించవచ్చు. ముఖ్యంగా ఎముకల్లో నొప్పి సమస్య తీవ్రంగా ఉంటుంది. నడుము నొప్పి, బ్యాక్ పెయిన్ కూడా ఉంటుంది. అంతేకాకుండా నాడీ వ్యవస్థపై కూడా ప్రభావం చూపిస్తుంది. 

Also read: Almonds Side Effects: బాదం ఇలా తింటే మద్యపానం కంటే ప్రమాదకరమని మీకు తెలుసా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News