Gastric Remedy: ఇంగువ వంటకు మంచి రుచిని అందిస్తుంది. ఇది మన వంట గదిలో నిత్యం అందుబాటులో ఉంటుంది. అంతేకాదు ఇంగువ వంటకు మంచి రుచిని కూడా అందిస్తుంది. అంతేకాదు ఇది కడుపు సంబంధిత సమస్యలు కూడా ప్రభావవంతమైన రెమిడీ.
ఇంగువ మసాలా కడుపు నొప్పి గ్యాస్‌ను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. ముఖ్యంగా ఇందులో యాంటీ గ్యాస్ ఏజెంట్‌గా కూడా పనిచేస్తుంది. ఇంగువ జీర్ణ శక్తిని పెంచుతుంది. ఇది కడుపులో అజీర్తి, అసిడిటీ గ్యాస్‌ను తొలగించే దివ్యౌషధం .
ఇది గ్యాస్, అసిడిటీ, అజీర్ణం, కడుపు తిమ్మిరి, అపానవాయువు సమస్యల నుండి ఉపశమనం పొందుతుంది .ఆహారం బాగా జీర్ణం కావడానికి ఇంగువ సహాయపడుతుంది.
వాములో యాంటీ మైక్రోబియల్ లక్షణాలు కనిపిస్తాయి. మీకు తరచుగా గ్యాస్ సమస్యలు ఉంటే వాము నీరు ప్రయోజనకరంగా ఉంటుంది. జీర్ణ సమస్యలను దూరం చేయడంలో ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
ఒక టీస్పూన్ వామును నీటిలో మరిగించి, దానికి నల్ల ఉప్పు వేసి తీసుకోవాలి. దీంతో గ్యాస్ నుంచి ఉపశమనం లభిస్తుంది. ఒకకప్పు నీటిలో 2 చిటికెల ఇంగువ వేసి మరిగించాలి. అందులో బ్లాక్ సాల్ట్ మిక్స్ చేసి ఈ నీటిని తాగాలి.
మీరు ఇంగువ, వాము నీటిలో కలిపి కూడా ఉడకబెట్టి తీసుకోవచ్చు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)