Bangladesh Crisis Reasons: బంగ్లాదేశ్ సంక్షోభం, రిజర్వేషన్ వివాదానికి కారణమేంటి, ఇండియాకు ఇబ్బంది కానుందా

Bangladesh Crisis Reasons: బంగ్లాదేశ్‌లో అంతర్యుద్ధాన్ని తలపించే సంక్షోభం చోటుచేసుకుంది. రిజర్వేషన్ల వివాదం కాస్తా తీవ్రమై ఆందోళనలు, హింసాపాతానికి దారి తీసింది. పరిస్థితి చేయి దాటడంతో ఆ దేశ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి ఇండియాలో ఆశ్రయం పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలు బంగ్లాదేశ్‌లో ఏం జరుగుతోంది. సంక్షోభానికి కారణాలేంటి పూర్తి వివరాలు మీ కోసం..

Bangladesh Crisis Reasons: బంగ్లాదేశ్‌లో పరిస్థితి ఈనాటిది కాదు. రిజర్వేషన్ల అంశంపై చాలాకాలంగా దేశంలో నలుగుతున్న వివాదం ఈసారి పరాకాష్టకు చేరింది. రాజకీయ కారణాలు, షేక్ హసీనా ప్రత్యర్థులు ఇలా వివిధ అంశాలు రిజర్వేషన్ రగడకు ఆజ్యం పోశాయి. ఏకంగా బంగ్లాదేశ్ పార్లమెంట్, అధికార నేతల నివాసాలపై దాడికి కారణమయ్యాయి. ప్రస్తుతం మిలిటరీ రంగంలో దిగి పరిస్థితి అదుపు చేసేందుకు ప్రయత్నిస్తోంది. అసలు బంగ్లాదేశ్ పరిస్థితి కారణమేంటి, జరిగిన పరిణామాలు ఇండియాకు మంచిదా కాదా..

1 /5

1971లో బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారి కుటుంబీకులకు అప్పటి ప్రధాని షేక్ ముజీబుర్ రెహమాన్  ప్రభుత్వం 30% రిజర్వేషన్లు కల్పించింది. ఉద్యోగాలు లేక నిరాశలో ఉన్న యువత ఈ నిర్ణయంపై ఆందోళనలకు దిగింది. నిరసనలు హింసాత్మకంగా మారడంతో రిజర్వేషన్లను 5 శాతానికి తగ్గించాలని సుప్రీం ఆదేశించింది. మెరిట్ ఆధారంగా 93 శాతం, దేశంలోని మైనారిటీలు, దివ్యాంగులకు 2 శాతం కల్పించాలని కోర్టు ఆదేశించింది. 

2 /5

BNP లీడర్ ఖలీదా జియా 1991-1996, 2001-2006 మధ్య బంగ్లా ప్రధానిగా ఉన్నారు. భారత వ్యతిరేక భావాలతో జియా బంగ్లాదేశ్‌లో ఇన్నాళ్లు రాజకీయం నడిపారు. గత ఎన్నికల్లో షేక్ హసీనాకు భారత్ సహకరించి బంగ్లా ఎన్నికల్లో జోక్యం చేసుకుందని ఆరోపిస్తూ భారత్ బాయ్‌కాట్‌కు పిలుపు నిచ్చింది BNP. షేక్ హసీనా అధికారంలో వచ్చాక అధికార దుర్వినియోగం, ఇతర కేసులతో జియా 2018 నుంచి జైల్లో ఉన్నారు. ఇటీవలే అధ్యక్షుని ఆదేశాలతో ఆమె విడుదలయ్యారు.

3 /5

షేక్ హసీనా 2009లో రెండోసారి పగ్గాలు చేపట్టాక చేసిన ప్రతీకార రాజకీయాలు ఆమె పతకానికి నాంది పలికాయి. 1971 యుద్ధ నేరాల కేసులను తిరగదోడి, విపక్ష నేతలు ఎన్నికల్లో పాల్గొన కుండా నిషేధించి, వారిని జైళ్లకు పంపారు. విపక్షాలు ఎన్నికల్లో పాల్గొన కుండా నిషేధించారు. వీటికి తోడు దేశంలో ఆర్థిక పరిస్థితి దిగజారడం, నిరుద్యోగం, హింస పెరిగి పోవడం లాంటి కారణాలు ప్రజల్లో తిరుగుబాటుకు దారి తీశాయి..

4 /5

షేక్ హసీనా పాలనలో భారత్-బంగ్లాదేశ్ మధ్య అనేక ఆర్థిక ఒప్పందాలు జరిగాయి. జల పంపకాల వివాదాలు పరిష్కారమయ్యాయి. ఇరు దేశాలను కలిపే రోడ్డు, రైల్వే ప్రాజెక్టులు వేగవంతమయ్యాయి. టెర్రరిజాన్ని అరికట్టేందుకు హసీనా మన దేశంతో కలిసి పని చేశారు. అయితే హసీనా రాజీనామాతో మాజీ ప్రధాని ఖలీదా జియా (బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ) పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది. ఇది ఇండియాకు కాస్త ఇబ్బందికర పరిణామం కావచ్చు.

5 /5

జమాతే ఇస్లామీ పాక్-బంగ్లాలో ప్రాబల్యం కలిగిన ఇస్లామిక్ రాజకీయ పార్టీ. 1941లో మౌలానా మౌదూది దీన్ని స్థాపించారు. బంగ్లాలో దీని విద్యార్థి విభాగం ఛాత్ర శిబిర్‌కు ఐఎస్ఐ అండ ఉందనే ఆరోపణలు వచ్చాయి. విద్యార్థి ఉద్యమం కాస్తా రాజకీయ ఉద్యమంగా మారడం వెనుక ఇదే కీలకమని తెలుస్తోంది. బంగ్లా అల్లర్ల వెనుక ఈ పార్టీ హస్తం ఉందని షేక్ హసీనా ఆగస్టు 1న జమాతే ఇస్లామీని ఉగ్రవాద సంస్థగా ప్రకటించి నిషేధించారు.