Raksha Bandhan 2024 Gift Ideas: అన్నాచెల్లెల్ల పవిత్ర బంధానికి గుర్తుగా చేసుకునే రక్షాబంధన్ లేదా రాఖీ పండుగ సమీపిస్తోంది. ఆగస్టు 19వ తేదీన రాఖీ పండుగ దేశవ్యాప్తంగా జరుపుకోనున్నారు. రాఖీ కట్టిన చెల్లెలికి అన్నయ్య బహుమతి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. అటు చెల్లెలు కూడా అన్నయ్యకు రాఖీతో పాటు మంచి గిఫ్ట్ ఇస్తోంది. మరి మీ అన్నయ్యకు ఏ గిఫ్ట్ ఇవ్వాలని ఆలోచిస్తున్నారా..మీ కోసం 5 గిఫ్ట్ ఐడియాలు..
స్మార్ట్ వాచ్ ప్రస్తుతం అంతా స్మార్ట్ వాచ్ ట్రెండ్ నడుస్తోంది. మీ అన్నయ్యకు లేద చెల్లెలికి రాఖీ సందర్భంగా స్మార్ట్ వాచ్ మంచి ఆప్షన్ కాగలదు.
చాకోలేట్ అండ్ డ్రై ఫ్రూట్స్ రాఖీ సందర్భంగా చాకోలేట్స్ లేదా డ్రై ఫ్రూట్స్ ప్యాకెట్ బహుమతిగా ఇవ్వడం మంచి ఆప్షన్. అందమైన ప్యాక్ లో ఇస్తే ఆకర్షణీయంగా ఉంటుంది
పర్ ఫ్యూమ్ పర్ ఫ్యూమ్ కూడా మంచి గఫ్ట్ ఐడియా కావచ్చు. మార్కెట్లో వివిధ రకాల ఖరీదైన పర్ ఫ్యూమ్ ప్యాక్స్ లభిస్తున్నాయి. ఇవి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. గిఫ్ట్ ఇచ్చేందుకు బాగుంటాయి.
స్పోర్ట్స్ షూస్ ఇటీవలి కాలంలో యూత్ ఎక్కువగా స్పోర్ట్ షూస్ ధరిస్తున్నారు. మీ సోదరునికి బహుమతిగా ఇచ్చేందుకు ఇది బెస్ట్ ఆప్షన్. 1500 ధరలో మంచి షూస్ లభిస్తాయి.
ట్రావెల్ బ్యాగ్ ప్యాక్ ట్రావెలింగ్ బ్యాగ్ ప్యాక్ కూడా చాలా మంది ఐడియా. సోదరుడికి లేదా సోదరికి ఇచ్చేందుకు బెస్ట్ ఆప్షన్ 1000 రూపాయల నుంచి 1500 రూపాయల్లో మంచి బ్యాగ్ ప్యాక్ లభిస్తుంది.