Manu bhaker: పారిస్ ఒలింపిక్స్ లో సత్తా చాటిన మనూభాకర్ మన దేశపు ఖ్యాతిని ఎవరెస్ట్ ఎత్తుకు తీసుకెళ్లింది. ప్రస్తుతం మనదేశ అథ్లేట్లు ఇంకా ఒలింపిక్స్ లో పతకాల కోసం పోరాడుతున్నారు.
విశ్వక్రీడలు ప్రస్తుతం పారిస్ లో జరుగుతున్నాయి.ఈ నేపథ్యంలో ఇప్పటికే భారత్ ఖాతాలో మూడు పతకాలు వచ్చి చేరాయి. రెండు పతకాలు గెల్చుకుని మనూబాకర్ హిస్టరీ క్రియేట్ చేశారు. అదే విధంగా మరో పతకాన్ని ఇటీవల షూటింగ్ లోనే స్వప్నిల్ కైవసం చేసుకున్నాడు.
ఈ నేపథ్యంలో ప్రపంచ క్రీడల్లో మన దేశం మూడపతకాలను గెల్చుకుంది. అదేవిధంగా మనూబాకర్ ట్రైనింగ్ కోసం కేంద్రం ఖేలో ఇండియాలో భాగంగా ఆమెపై రెండు కోట్లు ఖర్చుచేసిందని తెలిపింది. ఈ నేపథ్యంలో మనూను.. స్విట్జర్లండ్, జర్మనీ దేశాలకు పంపించి ఆమెకు నచ్చిన ట్రైనర్ తో షూటింట్ లో మెళకువలు నేర్చుకునేందుకు అవకాశం కల్పించారు.
మనూబాకర్ కూడా ఎంతో కష్టపడి మనదేశానికి పతకాలు సాధించడంలో ఆమె పడిన కష్టం ఫలించిందని చెప్పుకొవచ్చు. ఇదిలా ఉండగా.. మనూబాకర్ దేశంలో ఒక్కసారిగా స్టార్ గా మారిపోయింది. ఆమె బ్రాండ్ విలువ దక్కించుకునేందుకు అనేక కంపెనీలు పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది.
పారిస్ ఒలింపిక్స్ ముందు మనూబాకర్.. బ్రాండ్ గా ఉండేందుకు గాను..20-25 లక్షల వరకు వసూలు చేసేదంట. కానీ ఒలింపిక్స్ లో పతకాలు గెలవడంతో ఆమె ఒక రేంజ్ లో పాపులారీటీ సంపాదించుకున్నారు. దీంతో ఆమె కూడా తన బ్రాండ్ విలువను మార్కెట్ లో 6 నుంచి 7 రెట్లు పెంచుకున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనూభాకర్.. ఎండార్స్ మెంట్ కు గాను.. ఒక్కొ కంపెనీ నుంచి 1.5 కోట్లను డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో 40 కిపైగా కంపెనీలు ఇప్పటికే మనూభాకర్ బ్రాండ్ కోసం క్యూలో ఉన్నాయంట.
ఇప్పటికే చాలా కంపెనీల మధ్య అగ్రిమెంట్ పూర్తయిందని, కొన్ని కంపెనీలు ఏడాదికి గాను, మరికొన్ని ఒక నెల, మూడు నెలల పాటు కూడా బ్రాండ్ అంబాసిడర్ కోసం తమను సంప్రదించారంటూ కూడా మనూభాకర్ టీమ్ ఒక ప్రకటలో వెల్లడించారు.
గతంలో మనూభాకర్ ఆసియా గేమ్స్, కామన్ వెల్త్ గెమ్స్ సాధించింది. కానీ అప్పుడు మాత్రం.. ఇప్పుడున్నంత క్రేజ్ రాలేదని, ప్రస్తుతం ఇంకా అనేక కంపెనీలు తమతో సంప్రదింపులు జరుపుతున్నాయని కూడా మనూ టీమ్ తెలిపారు.
ఇదిలా ఉండగా.. గతంలో మనూభాకర్ ను అభినందిస్తు.. ఆమె బ్రాండ్ ను చూపే విధంగా.. ఫోటోలు, వీడియోలను ప్రచారంగా ఉపయోగించుకుంటున్న కొన్నికంపెనీలపై నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.