Saif Ali Khan Properties ప్రముఖ బాలీవుడ్ నటుడు అలీఖాన్ గురించి తెలియని వారు ఉండరు. హిందీలో ఎన్నో సినిమాలలో నటించిన సైఫ్ అలీ ఖాన్.. పుట్టడమే గోల్డెన్ స్పూన్ తో పుట్టారు. కానీ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఆయనకున్న ఐదువేల కోట్ల ఆస్తి తన నలుగురు పిల్లలలో ఎవరికీ చెందదు. ఎందుకో తెలుసా?
ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించారు. అయితే సినిమాలలో నటించి సైఫ్ అలీఖాన్ సంపాదించిన డబ్బులు పక్కన పెట్టేస్తే.. పుట్టడం సైఫ్ అలీ ఖాన్ పటౌడి కుటుంబంలో పుట్టారు. సైఫ్ అలీ ఖాన్ తండ్రి మన్సూర్ అలీ ఖాన్ దేశంలోనే బాగా డబ్బున్న వ్యక్తులలో ఒకరు.
సైఫ్ అలీ ఖాన్ 1991లో అమృత సింగ్ పెళ్లి చేసుకున్నారు. వారికి పుట్టిన పిల్లలే సారా అలీ ఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్. ఇద్దరు ఆల్రెడీ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. అమృతతో విడాకులు తీసుకున్న సైఫ్ 2012లో కరీనా కపూర్ ను పెళ్లి చేసుకున్నారు. వాళ్లకి తైమూర్, జహంగీర్ అని ఇద్దరు పిల్లలు జన్మించారు.
సైఫ్ అలీ ఖాన్ దగ్గర దాదాపుగా 5000 కోట్లు విలువ చేసే ఆస్తి ఉంది. చాలా ఆస్తి ఉన్న సైఫ్ అలీ ఖాన్ పిల్లలు కాబట్టి ఆస్తి మొత్తం తర్వాత వాళ్ళకి వెళుతుంది అని అందరూ అనుకుంటారు. కానీ అందులో ఒక్క రూపాయి కూడా వాళ్ళకి చెల్లదు. అవును.. నలుగురు పిల్లలలో ఒక్కళ్ళకి కూడా సైఫ్ అలీ ఖాన్ ఆస్తి మీద హక్కు లేదు.
సైఫ్ అలీ ఖాన్ ఆస్తి లో కొంచెం కూడా తన పిల్లలకి చెందదు. తనిఖీ కారణం సైఫ్ అలీ ఖాన్ ఉంటున్న పటౌడి ప్యాలెస్ 1968 ఎనిమీస్ డిస్ప్యూట్ ఆక్ట్ కిందకి వస్తుంది. అందుకే దీనిని ఎవరో తమది అని క్లెయిమ్ చేసుకోలేరు. ఈ ప్యాలస్ మాత్రమే కాదు.. పటౌడి కుటుంబానికి ఉన్న విలాసవంతమైన ప్రాపర్టీలన్నీ దీని కిందకి వస్తాయి.
ఒకవేళ సైఫ్ అలీ ఖాన్ తన ఆస్తిని తిరిగి పొందాలి అని అనుకుంటే.. హైకోర్టులో కేసు వేయాల్సిన అవసరం ఉంది. సైఫ్ అలీ ఖాన్ ముత్తాత హమీదుల్లా ఖాన్ బ్రిటిష్ రూల్ సమయంలో పెద్ద నవాబు. తనకున్న ఆస్తులకు దీనికి విల్లు రాయలేదు. కాబట్టి సైఫ్ అలీ ఖాన్ ఒకవేళ కేసు వేసినా కూడా.. చాలా కాలం పాటు ఈ ప్రాపర్టీ కోసం ఫైట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా సైఫ్ అలీ ఖాన్ ఆస్తులు ఏవి తన పిల్లలకి లీగల్ గా చెందవు.