Olympic Gold medal worth: ఒలింపిక్స్ లో గెలుపొందిన క్రీడాకారులకు ఇచ్చే పతకాలకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రస్తుతం పారిస్ లో ఒలిపింక్స్ విశ్వక్రీడలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. అథ్లెట్లు గెల్చుకున్న.. బంగారు పతకం విలువ ఎంతో అని చాలా మంది ఆసక్తిగా సెర్చ్ చూస్తున్నారు.
పారిస్ వేదికగా విశ్వక్రీడలు జరుగుతున్నాయి. జులై 26 నుంచి ఒలింపిక్స్ క్రీడలు ప్రారంభమయ్యాయి. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం భారత్ ఖాతాలో ఇప్పటి మూడు కాంస్య పతకాలు వచ్చి చేరాయి.రెండు మనూభాకర్, షూటింగ్ లో స్వప్నిల్ కాంస్యం గెలుచుకుంది.
ప్రస్తుతం దేశంలో బంగారం ధరలను చుక్కలు చూపిస్తున్నాయి. బడ్జెట్ ప్రకటించిన తర్వాత కొన్నిరోజులు తగ్గిన ధరల కాస్త.. మరల ఇప్పుడు బంగారం ధరలు మరల మండిపోతున్నాయి.
ఇదిలా ఉండగా.. ఈ పారిస్ ఒలింపిక్స్‌లో ప్రదానం చేస్తున్న పసిడి పతకం తయారు చేసేందుకు భారత కరెన్సీలో సుమారు రూ.86 వేలు ఖర్చు అవుతుందంట.
ఒలింపిక్ బంగారు పతకం 529 గ్రాముల బరువు ఉంటుంది. కానీ అందులో కేవలం 6 గ్రాముల బంగారం మాత్రమే ఉంటుంది. అంటే దాని మొత్తం బరువులో 1.3% మాత్రమే బంగారం. నిజానికి ఒలింపిక్స్‌లో లభించే బంగారు పతకాలు బంగారంతో తయారు చేయబడినవి కావు.
వీటికి జోడించిన చాలా లోహాలు వెండి. ఈ ఏడాది ఒలింపిక్స్‌లోనే కాదు. కొన్నేళ్లుగా జరుగుతున్న అంతర్జాతీయ ఒలింపిక్స్‌లోనూ ఇదే పరిస్థితి. బంగారు పతకం కనీసం 92.5% వెండిని కలిగి ఉంటుంది.
1912 స్టాక్‌హోమ్ ఒలింపిక్స్ వరకు పసిడి పతకాలంటే పూర్తిగా బంగారంతోనే తయారు చేసేవారు. అయితే, మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఒలింపిక్స్ నిర్వహణ వ్యయాలను తగ్గించేందుకు నిర్ణయం తీసుకున్నారు. దీనిలో భాగంగా.. స్వర్ణ పతకం తయారీలో మార్పులు చేశారు. పసిడి పతకాన్ని స్వచ్ఛమైన వెండితో చేసి, పైన బంగారు పూతను తాపడం చేయడం ఆరంభించారు.
ప్రస్తుతం స్వర్ణ పతకం బరువు 529 గ్రాములున్నట్లు తెలుస్తోంది. అంటే గోల్డ్ మెడల్లో గోల్డ్ ఉండేది 1.3 శాతమే. అయితే రజత పతకాన్ని మాత్రం పేరుకి తగ్గట్టే వెండితో చేస్తున్నారు. కాంస్య పతకాన్ని కాపర్, టిన్, జింక్ వంటి ఖనిజాల మిశ్రమంతో తయారు చేస్తున్నారు. బంగారు పతకాలు బంగారు పూతతో ఉంటాయి. దీంతో ప్రస్తుతం చాలా మంది బంగారు పతకంలో మరీ ఇంత తక్కువ ధరనా.. అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.