Potato Health Benefits: బంగాళదుంప అంటే ఇష్టపడిని వారు ఉండరు. అందరూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. భారతీయులు బంగాళ దుంపతో వివిధ రకాల ఆహార పదార్థాలు తయారు చేసుకుంటారు. చాలా మంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు. ఇలాంటి సమస్యలతో బాధపడేవారికి కూడా బంగాళ దుంప ఎంతగానో పని చేస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే మూలకాలు ఎముకలను ఆరోగ్యం చేస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇవే కాకుండా ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బంగాళదుంప తినడం వల్ల కలిగే లాభాలు:
క్రమం తప్పకుండా బంగాళ దుంప తినడం వల్ల శరీరానికి తగిన కార్బోహైడ్రేట్లు లభిస్తాయి. దీని కారణంగా శరీరానికి ఎప్పుడూ శక్తి లభిస్తుంది. అలాగే దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా రక్షిస్తాయి.
జీర్ణ వ్యవస్థకు మంచిది:
బంగాళదుంపల్లో ఉండే పీచు మలబద్ధకాన్ని నివారించడానికి సహాయపడుతుంది. తరచుగా పొట్ట సమస్యలతో బాధపడేవారు దీనిని ఆహారంలో తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా పొట్ట నొప్పి కూడా తగ్గుతుంది.
పోషకాలు లభిస్తాయి:
బంగాళాదుంపల్లో విటమిన్ సి, పొటాషియం, విటమిన్ బి6 వంటి ముఖ్యమైన పోషకాలు లభిస్తాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఎంతగానో సహాయపడతాయి. దీంతో పాటు రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది.
చర్మానికి మంచిది:
బంగాళాదుంపల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని మృదువుగా, మెరిసేలా చేసేందుకు ఎంతగానో సహాయపడుతుంది. దీంతో పాటు ముడతలు, నల్లటి మచ్చలు తగ్గించడానికి సహాయపడతాయి.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
కళ్లకు మంచిది:
బంగాళాదుంపల్లో ఉండే బీటా కెరోటిన్ కళ్ళ ఆరోగ్యాన్ని పెంచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో పాటు ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా రే చీకటిని కూడా సులభంగా తగ్గిస్తుంది.
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.