Weight Loss Tips: వేడి వేడి అన్నంలో ఈ పొడి కలుపుకుని తింటే చాలు..బెల్లీ ఫ్యాట్ ఐస్‎లా కరిగిపోవాల్సిందే..!!

 Weight Loss Tips: నేటికాలంలో చాలామంది అధిక బరువు, ఊబకాయం సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా అనేక మందిని బరువు సమస్య వేధిస్తోంది. దీని కారణంగా మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లతోపాటు ఇతర కారణాలు కూడా ఉన్నాయి. అధిక బరువు, ఊబకాయంతో బాధపడుతున్నవారికి  ఈ పొడి ఎంతో మేలు చేస్తుంది. ఏంటా పొడి? బరువు తగ్గడంలో ఎలా సహాయపడుతుందో తెలుసుకుందామా? 
 

1 /6

Weight Loss: స్థూలకాయంల అనేది ఒక రకమైన అనారోగ్య సమస్య. కొన్ని సార్లు ఎంత డైట్ మెయింటైన్ చేసినా..చెమటలు కారేలా జిమ్ వ్యాయామాలు చేసినా..పొట్టలోని కొవ్వు మాత్రం కరిగిపోదు. చిన్న వయస్సులో పెద్దవారిలా కనిపించేలా చేస్తుంది. నలుగురిలో తిరగడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. అంతేకాదు మీ అందాన్ని పొట్ట తగ్గించేస్తుంది. ఇవే కాదు క్యాన్సర్, షుగర్, అధిక రక్తపోటు వంటి అనేక ప్రాణాంతక వ్యాధుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. అయితే అధిక బరువును తగ్గించుకునేందుకు జీవనశైలిలో పలు మార్పులు చేసుకోవాలి. సమతుల్య ఆహారం, వ్యాయామంతో పాటు పలు చిట్కాలు ఫాలో అయితే పొట్టను తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా జీలకర్ర, సోంపు, వాముతో తయారు చేసిన పొడిని వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే ఒంట్లో కొవ్వు కరిగిపోతుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. అదేలా తయారు చేయాలో తెలుసుకుందాం. 

2 /6

కావాల్సిన పదార్థాలు : జీలకర్ర, సోంపు, వాము ఈ పదార్థాలను సమానం తీసుకుని పెనంగా దోరగా వేయించుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సర్ గ్రైండర్ లో వేసి పొడి చేసుకోవాలి. ఈ పొడిని ఒక గాజు పాత్రలో పోసి భద్రపరుచుకోవాలి.

3 /6

వాము ప్రయోజనాలు:వాములో కాల్షియం,  ఐరన్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని పోషకాలను గ్రహిస్తాయి. కొలెస్ట్రాల్ పెరగకుండా..ఆకలిని తగ్గించడంతోపాటు  ప్రేగులను శుభ్రంగా ఉంచుతుంది.

4 /6

సోంపు  ప్రయోజనాలు:తక్కువ కేలరీలు,ఫైబర్ పుష్కలంగా ఉన్న సోంపు ఆకలిని తగ్గిస్తుంది. శరీరంలో నీరు నిల్వకుండా చేస్తుంది.అంతేకాదు జీర్ణక్రియను మెరుగుపరిచి  శక్తి స్థాయిలను పెంచుతుంది.శరీరానికి శక్తినివ్వడంతోపాటు ఒత్తిడిని తగ్గిస్తుంది. మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లను నివారించి.. హార్మోన్ల సమతుల్యతను కాపాడుతుంది.

5 /6

జీలకర్ర  ప్రయోజనాలు: జీలకర్ర ఉన్న  థర్మోజెనిక్ గుణాలు శరీర ఉష్ణోగ్రతను పెంచి జీవక్రియ రేటును వేగవంతం చేస్తాయి.జీలకర్ర జీర్ణవ్యవస్థను బలంగా ఉంచుతుంది.  ఇది అజీర్ణం, గ్యాస్, ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. జీలకర్రలో ఉన్న  యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉండి శరీరంలోని కొలెస్ట్రాల్ ను  తగ్గిస్తుంది.

6 /6

ఈ పొడి ఎలా ఉపయోగపడుతుంది? ఈ పొడిని ఉదయం, మధ్యాహ్నం, రాత్రి భోజనానికి ముందు ఒక గ్లాసులో నిమ్మరసం తీసుకుని ఇందులో అరచెంచా ఈ పొడిని కలుపుకుని తాగాలి. లేదంటే అన్నంలో వేసుకుని కూడా తినవచ్చు. ఈ రెమెడీ అపాయనవాయువు, అజీర్ణం, బరువు పెరగడం, నిద్ర సమస్యలను పరిష్కరిస్తుంది.