ఈ సారి కచ్చితంగా అధికారంలోకి వస్తామని ప్రచారం చేసుకుంటున్న వైపీపీ నేతలపై మంత్రి దేవినేని సైటైర్లు సంధించారు. విజయవాడలో మంత్రి దేవినేని మీడియాతో మాట్లాడుతూ వాస్తవానికి ఈ ఎన్నికల్లో వైసీపీకి ప్రతిపక్ష హోదా కష్టమేనని...అధికారం వచ్చినట్లు వైసీపీ వారు పగటి కలులు కంటున్నారని ఎద్దేవ చేశారు.
డబ్బు కోసం ప్రశాంత్ కిషోర్ డ్రాామా ..
వాస్తవ ఫలితాలు గురించి తెలిస్తే జగన్ తట్టుకోలేరని..అందుకే ప్రశాంత్ కిషోర్ ఇలా మాట్లాడుతున్నారు... ఇందంతా ప్రశాంత్ కిషోర్ ఫైనల్ పేమెంట్ రాట్టేందుకు జగన్ చేతిలో సీఎం అనే నేమ్ ప్లేట్ పెట్టి వెళ్లారని విమర్శించారు .
చొక్కాలు చించుకునే సంస్కృతి జగన్‌దే ...
స్పీకర్ కోడెల దాడి అంశాన్ని ప్రస్తావిస్తూ అడ్డదారిలో గెలిచేందుకు వైసీపీ వారు ఏకంగా స్పీకర్ కోడెల దాడి చేశారని విమర్శించారు..దాడి చేసింది కాక గవర్నర్‌కు జగన్ ఫిర్యాదు చేయడం దారుణమన్నారు. జగన్ తీరు చూస్తుంటూ అబద్ధాన్ని నిజంగా చిత్రీకరించాలనే ఉద్దేశంతో ఉన్నట్లు కనిపిస్తున్నారని విమర్శించారు . కోడెల తన చొక్కా తనే చించుకున్నారని జగన్ చెబుతున్నారు... చొక్కాలు చించుకునే సంస్కృతి జగన్‌దేనని దేవినేని ఎదురు దాడి చేశారు.