Tirupati Laddu: అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తిరుమలపై ప్రత్యేక దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తిరుపతి లడ్డూను మరింత రుచిగా.. నాణ్యతగా తయారు చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. త్వరలోనే భక్తులకు ప్రత్యేక లడ్డూ అందనుంది. ఈ మేరకు టీటీడీ కసరత్తు ప్రారంభించింది. ఈ విషయాన్ని టీటీడీ ఈవో జె.శ్యామలరావు ప్రకటనరూపంలో వెల్లడించారు.
Also Read: Smita Sabharwal: స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఫైర్.. త్వరలోనే ఆమెపై రేవంత్ చర్యలు?
తిరుమల లడ్డూ ప్రసాదాలపై సర్వత్రా విమర్శలు వస్తున్న నేపథ్యంలో టీటీడీ దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. మరింత నాణ్యంగా, రుచికరంగా అందించాలనే లక్ష్యంతో టీటీడీ చర్యలు చేపట్టింది. తాను బాధ్యతలు చేపట్టిన అనంతరం లడ్డూ ప్రసాదాల రుచి, నాణ్యత పెరిగిందని టీటీడీ ఈఓ జె. శ్యామలరావు తెలిపారు. తక్కువ నాణ్యతతో కూడిన నెయ్యిని సరఫరా చేస్తున్న సరఫరాదారులు నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నాణ్యమైన నెయ్యి
ఈ మేరకు తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనంలో మంగళవారం మీడియాతో ఈవో మాట్లాడారు. తిరుమలలో ముఖ్యమైన నిర్ణయాలను ప్రకటించారు. లడ్డూ నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించినట్లు.. నాణ్యమైన నెయ్యి ద్వారా లడ్డూ నాణ్యత పెరుగుతుందని తెలిపారు. టీటీడీ వద్ద అడల్ట్రేషన్ టెస్ట్ చేసే పరికరం లేదని త్వరలో దానిని తీసుకురానున్నట్లు వెల్లడించారు. ముడి సరుకులు, నెయ్యి ప్రొక్యూర్మెంట్ సిస్టంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని.. వాటిలో మార్పులు చేస్తామని చెప్పారు.
కమిటీ ఏర్పాటు
నాణ్యమైన నెయ్యి కొనుగోలు విషయమై నలుగురు ప్రముఖ డైరీ నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు ఈవో శ్యామలరావు తెలిపారు. కమిటీలో ఎన్డీఆర్ఏ విశ్రాంత ఆచార్యులు డా.సురేంద్రనాథ్, హైదరాబాద్‌కు చెందిన డా.విజయ భాస్కర్ రెడ్డి, ప్రొఫెసర్ స్వర్ణలత, బెంగుళూరుకు చెందిన డా.మహదేవన్ ఉన్నారని వివరించారు. ఈ కమిటీ వారంలో ఇచ్చే నివేదిక ఆధారంగా నాణ్యమైన నెయ్యి కోసం టెండర్లో కొత్త అంశాలు చేరుస్తామని ప్రకటించారు.
రెండు కంపెనీలకు నోటీసులు
లడ్డూలో కీలకమైన నెయ్యి విషయమై ప్రస్తుత సప్లయర్స్‌కు నాణ్యమైన నెయ్యి సరఫరా చేయాలని సూచించినట్లు ఈవో తెలిపారు. ఒక సరఫరాదారు నకిలీ నెయ్యి అందిస్తున్నట్లు గుర్తించి బ్లాక్ లిస్ట్‌లో పెట్టామని.. మరో సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు. భక్తులకు నాణ్యమైన, రుచికరమైన లడ్డూ అందించడమే తమ లక్ష్యమని ప్రకటించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి