Tomato Chutney Recipe:ఇడ్లీ, దోశలకు పల్లీ చట్నీ తిని బోర్ కొట్టిందా? ఈ స్టైల్లో ఓసారి టమోటా చట్నీ ట్రై చేయండి.

Tomato Chutney: ఉదయం ఇడ్లీ, దోశ అనగానే పల్లీ చట్నీ గుర్తుకు వస్తుంది. ప్రతిరోజూ పల్లీ చట్నీతో దోశ, ఇడ్లీ తింటుంటే చాలా మంది బోర్ గా ఫీల్ అవుతుంటారు. అలాంటి వారు ఓసారి టమోటా చట్నీని ఈ స్టైల్లో ట్రై చేయండి. చేయడం కూడా చాలా ఈజీ అండోయ్. 
 

1 /8

Tomato Chutney Recipe: ఉదయ వేడి వేడి ఇడ్లీలోకి సాంబారు, దోశలోకి పల్లీ చట్నీ చేస్తుంటారు. కానీ రోజూ పల్లీ చట్నీ, సాంబారు అంటే చాలా మంది పిల్లలు, పెద్దలు బోర్ గా ఫీల్ అవుతుంటారు. పిల్లలు అయితే రోజూ పల్లీ చట్నీనేనా అంటూ తినమని మారం చేస్తుంటారు. పల్లీ చట్నీ కాకుండా వెరైటీగా ఏదైనా చేయోచ్చు కదా అంటుంటారు. వర్షాకాలంలో వేడి వేడి దోశలోకి స్పైసీగా టమోటా చట్నీ వేసుకుని తింటుంటే ఆ మజానే వేరుంటుంది. అయితే టమోటా చట్నీ  తయారు చేయాలంటే గంటల కొద్దీ సమయం అవసరం లేదు. ఈ ప్రాసెస్ లో తయారు చేస్తే కేవలం 15 నిమిషాల్లో పూర్తవుతుంది. దోశ, ఇడ్లీలకు వెరైటీ టమోటా చట్నీ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.   

2 /8

కావాల్సిన పదార్థాలు:పండి టమాటాలు -4,(బాగా పండినవి అయితే రుచి బాగుంటుంది) ఉల్లిగడ్డ 1 ( సన్నగా తరిగినది) 2 వెల్లుల్లి రెబ్బలు, అంగుళం అల్లం, హాఫ్ టీ స్పూన్ పసుపు, కారం పొడి 1 టీస్పూన్, ఉప్పు రుచికి సరిపడా, నూనె రెండు టేబుల్ స్పూన్స్, ఆవాలు, జీలకర్ర 1 టీస్పూన్, పచ్చిమిర్చి 2, కరివేపాకు కొద్దిగా.   

3 /8

తయారీ విధానం:ముందుగా స్టౌ వెలిగించుకుని ఒక కడాయి పెట్టాలి. అది వేడెక్కిన తర్వాత నూనె పోయాలి. నూనె వేడెయ్యాక అందులో తరిగిన ఉల్లిపాయలు వేసి బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు వేయించాలి.   

4 /8

స్టెప్ 2:ఇప్పుడు అందులో టమాటోలు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి టమాటాలు మెత్తగా అయ్యేంత  వరకు వేయించాలి. 

5 /8

స్టెప్ 3:టమాటాలు బాగా ఉడికిన తర్వాత అందులో పసుపు, కారం పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి ఇంకెంత సమయం ఉడికించాలి.   

6 /8

స్టెప్ 4:ఈ మిశ్రమ అంతా దగ్గరకు వచ్చిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి..పేస్టులా అయ్యేందుకు గరిటెతో నొక్కండి. లేదంటే మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోండి.

7 /8

స్టెప్ 5:ఇప్పుడు అదే కడాయిలో రెండు చెంచాల నూనె పోసి ఆవాలు, జీలకర్ర వేయాలి. ఆవాలు చిటపట అన్న తర్వాత కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు వేసి గ్రైండ్ చేసిన టమాటో పేస్టు అందులో వేయాలి. 

8 /8

స్టెప్ 6: అంతే సింపుల్ టమోటా చట్నీ రెడీ. ఈ చట్నీ అన్నం కానీ, దోశ, ఇడ్లీ ఇలా ఎందులో అయినా సరే వేసుకుని తినవచ్చు. రుచికి అద్భుతంగా ఉంటుంది.