Banks FD Interest Rates: దేశంలోని వివిధ బ్యాంకులు ఎఫ్‌డీలపై వేర్వేరుగా వడ్డీ చెల్లిస్తుంటాయి. ఎఫ్‌డి కాల వ్యవధిని బట్టి, బ్యాంకుని బట్టి వడ్డీ మారుతుంటుంది. ఇప్పుడు మనం అత్యధికంగా 8.75 శాతం వడ్డీ చెల్లించే బ్యాంకుల గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఎఫ్‌డీలపై 1-2 బ్యాంకులు అత్యధిక వడ్డీ ఆఫర్ చేస్తున్నాయి.
బ్యాంకులు లేదా పోస్టాఫీసుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ అనేది సురక్షితమైన ఇన్వెస్ట్‌మెంట్. జీరో రిస్క్ ఉంటుంది. అధిక లాభాలు కలుగుతాయి. ఎఫ్‌డీల్లో 7 రోజుల్నించి మొదలై 10 ఏళ్ల వరకూ ఉంటాయి. అతి తక్కువ కాల వ్యవధి అంటే 7 రోజుల్నించి 12 నెలల కాలవ్యవధికి కూడా ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి. ఇన్వెస్టర్లు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. మీక్కూడా ఎఫ్‌డి చేసే ఆలోచన ఉంటే ముందు ఏ బ్యాంకు ఎంత ఎఫ్‌డీ వడ్డీ చెల్లిస్తుందో చెక్ చేద్దాం.
ఎస్బీఐ బ్యాంకులో 7 రోజుల్నించి 1 ఏడాది కాల వ్యవధి కలిగిన ఎఫ్‌డీలపై సీనియర్ సిటిజన్లకు 3 శాతం నుంచి 5.75 శాతం వరకూ వడ్డీ చెల్లిస్తోంది.
ఇక పంజాబ్ నేషనల్ బ్యాంక్ అయితే 7 రోజుల్నించి 1 ఏడాది కాల వ్యవిధి కలిగిన ఎఫ్‌డీలపై సాధారణ పౌరులకు 3 శాతం నుంచి 7 శాతం వరకూ వడ్డీ ఆఫర్ చేస్తోంది.
కెనరా బ్యాంకు సైతం సాధారణ పౌరులకు 7 రోజుల నుంచి 1 ఏడాది కాలవ్యవధితో ఉండే ఎఫ్‌డీలపై 4 శాతం నుంచి 6.85 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది.
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు 7 రోజుల్నించి 1 ఏడాది కాల వ్యవధి కలిగిన ఎఫ్‌డీలపై 3-6 శాతం వడ్డీ చెల్లిస్తోంది.
ఐసీఐసీఐ బ్యాంకు 7 రోజుల్నించి 1 ఏడాది కాల వ్యవది కలిగిన ఎఫ్‌డీలపై సాధారణ పౌరులకు 3-6 శాతం వడ్డీ ఇస్తోంది.
ఎస్ బ్యాంకు సాధారణ పౌరులకు 7 రోజుల్నించి 1 ఏడాది ఎఫ్‌డీలపై 3.25 శాతం నుంచి 7.25 శాతం వరకూ వడ్డీ ఇస్తోంది.
ఇక అత్యధికంగా వడ్డీ ఆఫర్ చేస్తున్న బ్యాంకుల్లో చిన్న బ్యాంకులున్నాయి. ఇందులో సూర్యోదయ స్మాల్ పైనాన్స్ బ్యాంకు 7 రోజుల్నించి 1 ఏడాది కాల వ్యవధి ఎఫ్‌డీలపై 4 శాతం నుంచి 6.85 శాతం వడ్డీ ఇస్తోంది. యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు 7 రోజుల్నించి 1 ఏడాది కాల వ్యవధి ఎఫ్‌డీపై 4.50 శాతం నుంచి 7.85 శాతం వరకూ వడ్డీ ఇస్తోంది. ఇక అన్నింటికంటే అత్యధికంగా జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఆఫర్ చేస్తోంది. 7 రోజుల్నించి 1 ఏడాది కాల వ్యవధి కలిగిన ఎఫ్‌డీపై ఈ బ్యాంకు 3 శాతం నుంచి 8.50 శాతం వరకూ చెల్లిస్తోంది. సీనియర్ సిటిజన్లకు ఇదే బ్యాంకు 8.75 శాతం అందిస్తోంది.
Also read: Uric Acid: యూరిక్ యాసిడ్ ఎప్పుడు పెరుగుతుంది, ఆర్ధరైటిస్‌కు దారి తీస్తుందా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook