Tollywood top dubbed movies openings: ‘భారతీయుడు 2’ సహా తెలుగు డబ్బింగ్ మూవీస్ లో అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రాలు..

Tollywood top dubbed movies openings: టాలీవుడ్  సినిమాలు ఇతర భాషల్లో డబ్బై మంచి కలెక్షన్స్ సాధిస్తున్నాయి. ప్యాన్ ఇండియా మూవీస్ వచ్చిన తర్వాత డబ్బింగ్ చిత్రాల తాకిడి మొదలైంది. తాజాగా కమల్ హాసన్ నటించిన ‘భారతీయుడు 2’ మూవీ తెలుగులో మంచి బిజినెస్ చేసింది. అంతేకాదు తొలి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. ఓవరాల్ గా తెలుగులో అత్యధిక ఫస్ట్ డే కలెక్షన్స్ రాబట్టిన చిత్రాల విషయానికొస్తే..

1 /9

‘భారతీయుడు 2’ సహా తెలుగు డబ్బింగ్ మూవీస్ లో  అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రాలు. తాజాగా కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో వచ్చిన ‘భారతీయుడు 2 మూవీ ప్లేస్ ఎక్కడ అంటే..

2 /9

 KGF Chapter 2 ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా  తెరకెక్కిన మూవీ ‘కేజీఎఫ్ 2’. ఈ సినిమా తెలుగులో రూ. 78 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా తెలుగులో రూ. 19.09 కోట్ల షేర్ తో అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన డబ్బింగ్ సినిమాల్లో ఫస్ట్ ప్లేస్ లో ఉంది.

3 /9

రజినీకాంత్, అక్షయ్ కుమార్ హీరోలుగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘2.O’. ఈ సినిమా తెలుగులో రూ. 71 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా తెలుగులో తొలి రోజు రూ. 12.45 కోట్ల షేర్ రాబట్టి రెండో ప్లేస్ లో నిలిచింది.

4 /9

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా పా రంజిత్ డైరెక్షన్ లో  తెరకెక్కిన మూవీ ‘కబాలి’. ఈ సినిమా తెలుగులో మొదటి రోజు  రూ. 9.31 కోట్ల షేర్ రాబట్టి మూడో స్థానంలో నిలిచింది.

5 /9

విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘లియో’. ఈ సినిమా తొలి రోజు తెలుగులో రూ. 8.31 కోట్ల షేర్ రాబట్టి నాల్గో స్థానంలో నిలిచింది. 

6 /9

విక్రమ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన మూవీ ‘ఐ’ (మనోహరుడు). ఈ సినిమా తెలుగులో ఫస్ట్ డే 7.56 కోట్ల షేర్ తో టాప్  5 లో నిలిచింది.

7 /9

రజినీకాంత్ హీరోగా తెరకెక్కిన నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘జైలర్’. ఈ సినిమా ఫస్ట్ డే రూ. 7.01 కోట్ల షేర్ తో టాప్ 6లో నిలిచింది.

8 /9

రజినీకాంత్ హీరోగా పీఏ రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో రూ. 33 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

9 /9

శంకర్ దర్శకత్వంలో  కమల్ హాసన్ టైటిల్ రోల్లో నటించిన సినిమా ‘భారతీయుడు 2’. ఈ సినిమా తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 6.75 కోట్ల ఓపెనింగ్స్ తో టాప్ 7లో నిలిచింది.