Devara: కొరటాల శివ దర్శకత్వంలో.. జూనియర్ ఎన్టీఆర్ తాజాగా నటిస్తున్న చిత్రం దేవర. ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఇక మొదటి భాగం ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కి సంబంధించి పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. ఇప్పుడు సినిమా నుంచి తాజాగా ఒక డైలాగ్ లీక్ అయినట్లు సమాచారం.
' సాదాసీదా మగాళ్లు కావాలా.. ఈ ఊరినే ఉప్పొంగించే వీరుడు కావాలా..' అంటూ ఎన్టీఆర్ చెప్పిన ఒక డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో.. తెగ హల్ చల్ చేస్తోంది. ఈ డైలాగ్ విన్న తర్వాత మాస్ అభిమానులకు ఫుల్ మీల్స్ ఇవ్వబోతున్నారని అయితే స్పష్టం అవుతోంది. డైలాగులతోనే సినిమాపై హైప్ పెంచేసిన చిత్ర బృందం.. మరి సినిమా విడుదల అయ్యాక.. ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా వైడ్ గా.. రాబోతున్న ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీన విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని అధికారికంగా చిత్ర బృందం స్పష్టం చేసింది. ఇకపోతే ఈ సినిమాలో.. బాలీవుడ్ బ్యూటీ దివంగత నటీమణి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్.. తొలిసారి తెలుగు తెరకు పరిచయం కాబోతున్న విషయం తెలిసిందే. గతంలో సీనియర్ ఎన్టీఆర్ సరసన నటించిన శ్రీదేవి.. మళ్లీ తన కూతురు తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెడితే అది సీనియర్ ఎన్టీఆర్ మనవడు ఎన్టీఆర్ తోనే స్క్రీన్ షేర్ చేసుకోవాలని తన కోరికను జూనియర్ ఎన్టీఆర్ తో చెప్పినట్లు.. ఆయనే స్వయంగా వెల్లడించారు. ఇక ఆమె కోరిక మేరకు జాన్వీ కపూర్ తొలిసారి తెలుగులో ఎన్టీఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది ... అలా శ్రీదేవి కలను కూడా నెరవేర్చబోతున్నారని సమాచారం.
ఇక ఎన్టీఆర్ విషయానికొస్తే... రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈయన.. ఈ సినిమాతో ఏకంగా గ్లోబల్ వైడ్ పాపులారిటీ సంపాదించుకున్నారు.. ఈ నేపథ్యంలోనే తన తదుపరి చిత్రాలన్నీ కూడా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు.
అందులో భాగంగానే దేవర రిలీజ్ అవుతోంది. ఈ సినిమా తర్వాత కేజిఎఫ్ సినిమాలతో.. కన్నడ సినీ పరిశ్రమను దేశవ్యాప్తంగా పరిచయం చేసిన ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఒక సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం.
Also Read: Sonu Sood: హీరో సోనూసూద్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిన కుమారీ ఆంటీ.. వీడియో వైరల్..
Also Read: Mohammed Siraj: క్రికెటర్ సిరాజ్‌కు తెలంగాణ బంపరాఫర్.. రేవంత్ రెడ్డి ఏమిచ్చారో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి