/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

Ys jagan vijayamma Bharathi pay tributes to ysr On birth anniversary: ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల వైఎస్సార్సీపీ చిత్తుగా ఓడిపోయింది. ఈ షాక్ నుంచి ఇప్పటికి కూడా మాజీ సీఎం వైఎస్ జగన్,వైసీపీ నేతలు కోలుకోలేదని చెప్పుకొవచ్చు. వైనాట్ 175 అన్న జగన్ కు.. ప్రజలు కేవలం 11 స్థానాలకు పరిమితం చేశారు. తమ పథకాలే తమను గెలిపిస్తాయని అనుకున్న జగన్న కు ప్రజలు కలలో కూడా ఊహించని విధంగా ఓటమిని కట్టబెట్టారు.  ఇప్పటికే జగన్ దీనిపై, తమ నేతలతో, సీనియర్ నాయకులతో చర్చలు జరుపుతున్నారు. ఇదిలా ఉండగా.. ఈరోజు దివంగత నేత వైఎస్సార్ 75 వ జయంతి ఉత్సవాలను ఏపీవ్యాప్తంగా  ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు.

Read more: Sonu Sood: హీరో సోనూసూద్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిన కుమారీ ఆంటీ.. వీడియో వైరల్..

పార్టీలకు అతీతంగా మహానేత చేసిన మంచిని గుర్తు చేసుకున్నారు. తన పాదయాత్రతో  ప్రజల్లోకి వెళ్లి, ప్రజల బాధలు తెలుసుకుని తిరిగి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకుని వచ్చారు. ప్రజలకు రాజీవ్ ఆరోగ్య శ్రీ, బియ్యం, 108 , ఫీజ్ రీయింబర్స్ మెంట్ వంటి పథకాలు అనేకం తీసుకొచ్చారు. ఆయన రాజకీయాలకు అతీతంగా అందరికి మేలు చేసే అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఇక ఆయన చేసిన సేవలను కాంగ్రెస్ ప్రభుత్వం సైతం గుర్తు చేసుకుని నివాళులు అర్పించింది. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ సైతం ఈరోజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, ఏపీకి చేసిన మంచిని గుర్తు చేసుకున్నారు.

ఇదిలా ఉండగా.. ఈరోజు ఇడుపుల పాయలో వైఎస్ విజయమ్మ వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించడానికి వెళ్లారు. చాలా సేపు ఘాట్ వద్ద మౌనంగా కూర్చుండిపోయారు. అప్పుడు వైఎస్ జగన్, కోడలు భారతీ వచ్చారు. కొడుకును చూడగానే విజయమ్మ ఎమోషనల్ అయ్యారు.వైసీపీ ఓడిపోయిన తర్వాత తొలిసారి తన కొడుకును కలవడంతో ఆమె ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. జగన్ ను ప్రేమగా దగ్గరకు తీసుకుని హత్తుకున్నారు. ఇదిలా ఉండగా.. కోడలు భారతీ మాత్రం అంటి ముట్టనట్లు ఉన్నట్లు తెలుస్తోంది. విజయమ్మ వెళ్లి భారతీని పలకరించి, ఎవరికి వారు ఎడ ముఖం పెడముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.  

Read more:Snakes dance: పాముల సయ్యాట.. పచ్చని పొలంలో అరుదైన ఘటన.. వైరల్ వీడియో..

అత్తకోడళ్ల మధ్య పంచాయతీ నడుస్తుందని రాజకీయాల్లో చర్చ జరుగుతుంది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో విజయమ్మ.. కూతురు షర్మిల వైపు ఉండటం, తమ బిడ్డకు ఓటువేసి గెలిపించాలని అమెరికానుంచి వీడియో రిలీజ్ చేయడం పట్ల భారతీ ఒకింత నిరుత్సాహంతో ఉన్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో వైఎస్ జగన్ ఓటమికి ఇండైరెక్ట్ గా.. షర్మిల వ్యాఖ్యలు కారణమై ఉండోచ్చని, తన భర్తను జైలులో పెట్టిన పార్టీలో చేరడం పట్ల భారతీ, షర్మిల పట్ల గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ఏది ఏమైన పెద్దాయన జయంతి నేపథ్యంలో..వైఎస్సార్ సమాధి సాక్షిగా అత్తాకోడళ్ల పంచాయతీ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Section: 
English Title: 
ys vijayamma jagan and Bharathi pay tribute to YSR 75th birth anniversary at idupulapaya shocking reaction goes viral pa
News Source: 
Home Title: 

YSR Birth Anniversary: జగన్ సాక్షిగా అత్తా కోడలి పంచాయతీ.. వైఎస్సార్ సమాధి వద్ద ఊహించని ఘటన.. అసలేం జరిగిందంటే..?

YSR Birth Anniversary: జగన్ సాక్షిగా అత్తా కోడలి పంచాయతీ.. వైఎస్సార్ సమాధి వద్ద ఊహించని ఘటన.. అసలేం జరిగిందంటే..?
Caption: 
ysjagan(file)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

ఇడుపుల పాయలో వైఎస్సార్ కు ఘనంగా నివాళులు..

అంటి ముట్టనట్టుగా ఉన్న అత్తాకోడలు..

Mobile Title: 
YSR Birth Anniversary: జగన్ సాక్షిగా అత్తా కోడలి పంచాయతీ.. వైఎస్సార్ సమాధి వద్ద..
Inamdar Paresh
Publish Later: 
No
Publish At: 
Monday, July 8, 2024 - 16:17
Created By: 
Indamar Paresh
Updated By: 
Indamar Paresh
Published By: 
Indamar Paresh
Request Count: 
75
Is Breaking News: 
No
Word Count: 
335