T20 World Cup Afg vs SA: టీ20 ప్రపంచకప్ 2024 సూపర్ 8 దశలో మేటి జట్టు ఆస్ట్రేలియాను ఓడించి చరిత్ర సృష్టించిన ఆఫ్ఘనిస్తాన్ సెమీస్‌లో దక్షిణాఫ్రికాకు గట్టిపోటీ ఇస్తుందని లేదా మరోసారి సంచలనం రేపవచ్చని ఆంతా ఆశించారు. కానీ అత్యంత పేలవమైన ఆటతీరుతో వెనుదిరిగింది. భారీ విజయం సాధించిన సఫారీ జట్టు ఫైనల్‌కు చేరుకుంది.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024 తొలి సెమీ ఫైనల్స్ దక్షిణాప్రికా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ ముగిసింది. 40 ఓవర్లు జరగాల్సిన మ్యాచ్ కేవలం 19 ఓవర్లనే ముగిసింది. ఆస్ట్రేలియాపై విజయంతో సంచలనం రేపిన ఆఫ్ఘనిస్తాన్ సెమీస్‌లో చేతులెత్తేసింది. దక్షిణాఫ్రికా పేసర్లు జాన్సన్, రబడ, నోర్తెజ్ ముందు నిలువలేకపోయింది. పట్టుమని 10 ఓవర్లు ఆడటం కష్టమైపోయింది. ఓ దశలో 39 బంతుల్లో 6 వికెట్లు కోల్పోయింది. ఆ తరువాత సఫారీ స్పిన్నర్ల ధాటికి మిగిలిన 4 వికెట్లు సమర్పించుకుంది. టాస్ గెలిసి బ్యాటింగ్ ఎంచుకుంది ఆఫ్ఘనిస్తాన్. కానీ తొలి ఓవర్‌లోనే టోర్నీ టాప్ స్కోరర్ రహ్మనుల్లా గుర్బాజ్ డకౌట్ అయ్యాుడు. రెండో ఓవర్‌లో రబడ వరుసగా రెండు వికెట్లు పడగొట్టాడు. పవర్‌ప్లే దశలోనే 23 పరుగులకు 5 వికెట్లు పోగొట్టుకుంది. మొత్తానికి 11.5 ఓవర్లు మాత్రమే ఆడగలిగింది. 56 పరుగులకు ఆలవుట్ అయింది.
అత్యల్పమైన 57 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన సఫారీ జట్టుకు విజయం పెద్ద కష్టం కాలేదు. సెమీస్ పోరులో ఇంత సులభమైన విజయం దక్కుతుందని ఆ జట్టు బహుశా భావించి ఉండదు. 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. 8.5 ఓవర్లలోనే 1 వికెట్ నష్టానికి 60 పరుగులు చేసింది.
ఈ నెల 29న జరిగే టీ 20 ప్రపంచకప్ 2024 ఫైనల్‌లో దక్షిణాఫ్రికా..ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ జట్లలో ఒకదానితో తలపడనుంది. ఆఫ్ఘన్‌పై విజయంతో దక్షిణాఫ్రికా జట్టు టీ20 ప్రపంచకప్‌లో తొలిసారి ఫైనల్ చేరినట్టయింది. ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ మ్యాచ్‌కు వర్షం ప్రధాన అడ్డంకిగా ఉండటంతో రద్దయ్యే అవకాశాలున్నాయి. అదే జరిగితే ఇండియా ఫైనల్‌లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook