bjd leader let loose dogs to attack lady journalist in odisha: సమాజంలో జరుగుతున్న అనేక అన్యాయాలు, అక్రమాలను జర్నలిస్ట్ లు అందరికి తెలిసేలా చేస్తుంటారు. ఎంతో కష్టపడి.. తమ ప్రాణాలను సైతం రిస్క్ లో పెట్టి వార్తలను కవర్ చేస్తుంటారు. సోసైటీలో ఫోర్త్ పిల్లర్ బాధ్యతలను సమర్థవంతగా నిర్వహిస్తారు. ఇలాంటి నేపథ్యంలో కొన్నిసార్లు రిపొర్టర్ లు, జర్నలిస్ట్ లు వార్తలను కవర్ చేసేటప్పుడు షాకింగ్ ఘటనలు ఎదురౌతుంటాయి. కొన్నిసార్లు న్యూస్ కవర్ చేస్తున్నప్పుడు ఆకతాయిలు వేధిస్తుంటారు. రాజకీయనాయకులు బెదిరింపులకు గురిచేస్తుంటారు. రౌడీ షీటర్లు చంపేస్తామంటూ వార్నింగ్ ఇస్తుంటారు.
#WATCH | #BJD heavyweight and former Minister Raghunandan Das let his dogs chase woman journalist of #ArgusNews, Chinmayee Sahoo during media coverage of demolition of luxurious Government quarters of ex-BJD MLA Pranab Prakash Das in #Bhubaneswar #Odisha #JournalistAttacked pic.twitter.com/kcw5xCwzMT
— Argus News (@ArgusNews_in) June 25, 2024
వీటన్నింటికి తట్టుకొని జర్నలిస్టులు వార్తలను కవర్ చేస్తుంటారు. ముఖ్యంగా లేడీ రిపోర్టర్ లు, వారితో ఉండే కెమెరామెన్ లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎందుకంటే రిపోర్టర్ లు ఎంత బాగా ఘటన చెబితే.. కెమెరామెన్ లు అంతే బాగా లైవ్ లో ఘటనను ఫోటోలు, వీడియోల రూపంలో కళ్ల ముందుంచుతారు. ఈ నేపథ్యంలో ఒక పొలిటిషియన్ ఇంటి వద్ద అక్రమ నిర్మాణాలను కూల్చేస్తున్న ఘటనను.. కవర్ చేయడానికి ఒక లేడీ రిపోర్టర్ , కెమెరామెన్ తీసుకొని వెళ్లింది.అప్పుడు ఆమెకు షాకింగ్ అనుభవం ఎదురైంది. ఈ ఘటన వార్తలలో నిలిచింది.
పూర్తి వివరాలు..
ఒడిశాకు చెందిన మాజీ ఎమ్మెల్యే, బిజూ జనతా దళ్ పార్టీకి చెందిన నేత ప్రణబ్ ప్రకాష్ దాస్ ప్రవర్తించిన తీరు ఇప్పుడు తీవ్రవిమర్శలకు దారితీస్తుంది. ఆయనకు గతంలో..కేటాయించిన అధికారిక నివాసంలో అక్రమ కట్టడాలు నిర్మించారు. ఈ నేపథ్యంలో.. ఇటీవల జరిగన ఎన్నికల్లో బీజేడీ ఓటమి పాలయ్యింది. ఎమ్మెల్యేగా కూడా ప్రణబ్ ప్రకాష్ దాస్ ఓటమి చెందడంతో ఆ అధికారిక నివాసం ఖాళీ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే ఆ నివాసంలో నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేయడం ప్రారంభించారు.
ఈ ఘటనను లోకల్ మీడియా.. కవర్ చేయడానికి వచ్చింది. స్థానిక ఒడియా మీడియాకు చెందిన ఒక లేడీ రిపోర్టర్, కెమెరామెన్తో సహా అక్కడికి వచ్చారు. అక్కడి కూల్చివేతలను కవర్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న మాజీ మంత్రి రఘునందన్ దాస్ అభ్యంతరం తెలిపారు. అప్పటికి ఆయన రెండు కుక్కలను చైన్ లతో పట్టుకుని,ఆయన దగ్గర పనివాళ్లు సైతం ఉన్నారు. అప్పుడు వారి మధ్య కాస్త వాగ్వాదం కూడా జరిగింది. వెంటనే మాజీ మంత్రి.. తన రెండు పెంపుడు కుక్కలను.. లేడీ జర్నలీస్ట్ మీదకు ఉసిగొల్పారు. దీంతో అవి గట్టిగా అరుస్తూ రిపోర్టర్, కెమెరామాన్ మీదకు దాడికి తెగబడ్డాయి.
పాపాం.. లేడీ జర్నలిస్ట్ గట్టిగా అరుస్తున్న అరుపులు వీడియోలో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటనలో లేడీ జర్నలిస్ట్ తో పాటు, కెమెరామెన్ కు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి రఘునందన్ దాస్‌పై వారిద్దరూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై జర్నలిస్ట్ సంఘాలు తీవ్రంగా స్పందించాయి. రఘునందన్ దాస్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ప్రస్తుతం ఈ ఘటన మాత్రం రాజకీయాల్లో తీవ్ర దుమారంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి