Telangana Inter Supply Results 2024 Link: తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ రిజల్ట్స్ వచ్చేశాయి. ఫస్ట్, సెకెండియర్ ఫలితాలను ఇంటర్ బోర్డు అధికారులు విడుదల చేశారు. మే 24 నుంచి జూన్ 3వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించారు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు మొత్తం 4.5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. జనరల్ కోర్సుల్లో 74.1% మంది పాస్ అవ్వగా.. ఒకేషనల్ కోర్సుల్లో 66.63% మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇందులో జనరల్ కోర్సుల్లో అమ్మాయిలు 70.26 శాతం మంది, ఒకేషనల్ కోర్సుల్లో 69.64% మంది పాస్ అయ్యారు. జనరల్ కోర్సుల్లో అబ్బాయిలు 58.39 శాతం మంది, ఒకేషనల్ కోర్సుల్లో 43.76 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల కోసం https://results.cgg.gov.in/ లేదా https://www.manabadi.co.in/ వెబ్సైట్లను సందర్శించండి. లేదా ఈ ఇక్కడ క్లిక్ చేయండి.
ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి.
==> tgbie.cgg.gov.inలో అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
==> హోమ్‌పేజీలో రిజల్ట్స్ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
==> తెలంగాణ ఇంటర్ 1వ, 2వ సంవత్సరం సప్లిమెంటరీ ఫలితాలు 2024 లింక్‌పై క్లిక్ చేయండి.
==> ఇంటర్ హాల్ టిక్కెట్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
==> తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు 2024 స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి.
==> భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్‌అవుట్‌ని డౌన్లోడ్ చేసి తీసుకోండి.