Snake skin benefits: పాములు చాలా అరుదుగా తమ కుబుసంను వదులుతుంటాయి. ఆ సమయంలో అవి చాలా కోపంగా ఉంటాయని కూడా చెబుతుంటారు.
చాలా మంది పాములంటే చచ్చేంత భయంతో ఉంటారు. పాములు ఎక్కువగా అడవులు, నీళ్లు, ఎలుకలు ఉన్నచోట ఉంటాయి. పాములు కన్పిస్తే, కొందరు చంపేస్తుంటే, మరికొందరుస్నేక్ సొసైటీల వారికి సమాచారంఇస్తారు.
ముఖ్యంగా వర్షాకాలంలో పాములు ఎక్కువగా సంచరిస్తుంటాయి. ఈ సమయంలో ఎంతో అలర్ట్ గా ఉండాలి. పాములకు ఆపదను కల్గించకూడదంటూ పండితులు చెబుతుంటారు. పాములు పగబడుతాయని అంటారు. కానీ అందులో ఎంత వరకు నిజం ఉందనేది మాత్రం తెలియరాలేదు.
ఇక పాములు తమశరీరంనుంచి కుబుసం ను విడుస్తుంటాయి. ఈ సమయంలో చాలా కోపంతోఉంటాయి. పాములు కుబుసం వల్ల ధనయోగం ఏర్పడుతుందని జ్యోతిష్యులు చెబుతుంటారు. అడవిలో కుబుసం దొరికితే ఇంట్లో తెచ్చిపెట్టుకొవాలంటారు.
కుబుసంలో ధనాన్ని ఆకర్శించే గుణాలు ఉంటాయని చెబుతుంటారు. అందుకు కుబుసం ను తీచ్చుకుని ఒక పెట్టెలో జాగ్రత్తగా పెట్టాలి. కుబుసం వల్ల నెగేటివ్ ఎనర్జీ దూరమౌతుంది. ఇంట్లో పాజిటివ్ వాతావరణం నెలకొని ఉంటుంది.
పాములు కుబుసంను విడిచేటప్పుడు చాలా నరకం అనుభవిస్తాయని చెబుతుంటారు. ఆరునెలలకుఒకసారి పాములు కుబుసంను విడుస్తాయంట. అలాంటి కుబుసం ఇంట్లో తెచ్చుకుని పెట్టుకుంటే, ఇక మీ జీవితమే మారిపోతుందని జ్యోతిష్యులు చెబుతుంటారు.
ప్రతిరోజు ఆ కుబుసంను చూసి బైటకు వెళ్లే మీరు అనుకున్న పనులు, సకాలంలో పూర్తవుతాయి. ముఖ్యంగా కోర్టుకేసుల సమస్యలున్న వారికి ఇది ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుంది. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)