తెలంగాణలో మరో 2 కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన సర్కార్

తెలంగాణలో రేపటి నుంచి 33 జిల్లాలు

Last Updated : Feb 17, 2019, 11:34 AM IST
తెలంగాణలో మరో 2 కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన సర్కార్

హైదరాబాద్: తెలంగాణలో ప్రస్తుతం 31 జిల్లాలు ఉండగా రేపటి నుంచి మరో రెండు కొత్త జిల్లాలు అందుబాటులోకి రానున్నాయి. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు నారాయణ్‌పేట, ములుగును కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్‌.. తాజాగా తెలంగాణ సర్కార్ అందుకు సంబంధించిన గెజిట్‌ నోటిఫికేషన్‌ను కొద్దిసేపటి క్రితం విడుదల చేసింది. దీంతో రేపటి నుంచి నారాయణ్‌పేట, ములుగు కొత్త జిల్లాలుగా ఏర్పాటు కానున్నాయి. తెలంగాణ సర్కార్ నిర్ణయంతో తెలంగాణలో మొత్తం జిల్లాల సంఖ్య 33కి చేరింది. 

నారాయణపేట జిల్లాలో నారాయణ్‌పేట, దామరగిద్ద, ధన్వాడ, మరికల్‌, కోస్గి, మద్దూరు, ఉట్కూర్‌, నర్వ, మక్తల్‌, మాగనూరు, కృష్ణా కలిపి మొత్తం 11 మండలాలు ఉండనుండగా ములుగు జిల్లా పరిధిలో ములుగు, వెంకటాపూర్‌, గోవిందరావుపేట, తాడ్వాయి (సమ్మక్క సారక్క), ఏటూరు నాగారం, కన్నాయిగూడెం, మంగపేట్‌, వెంకటాపురం, వాజేడుతో కలిపి మొత్తం 9 మండలాలు ఉన్నాయి. రేపటి నుంచి అధికారికంగా జిల్లాలు ఏర్పాటు కానుండగా ఆ తర్వాత ప్రస్తుత జిల్లాల నుంచి అధికార వికేంద్రీకరణ ఉండనుందని తెలుస్తోంది. 

Trending News