Early Signs: ప్రాణాంతక వ్యాధులతో చాలా అప్రమత్తంగా ఉండాలి. శరీరంలో కన్పించే వివిధ రకాల లక్షణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు. సకాలంలో పసగట్టితే చాలావరకూ పరిష్కారం ఉంటుంది. ఆలస్యమయ్యే కొద్దీ కొన్ని వ్యాదుల్ని నయం చేయలేని పరిస్థితి ఉంటుంది. చేతుల్లో కన్పించే ఓ రకమైన లక్షణాలు లేదా మార్పు 3 ప్రాణాంతక వ్యాధులకు కారణం కావచ్చంటున్నారు.
ఎడిమా అంటే వేలు, అరచేయిలో అకారణంగా స్వెల్లింగ్ ఉంటే ప్రాణాంతక వ్యాదికి ప్రారంభ లక్షణం కావచ్చు. శరీరంలో నీరు పేరుకుపోయినప్పుడే ఈ పరిస్థితి ఉంటుంది. వాటర్ రిటెన్షన్‌కు అర్ధమిది. గుండె వ్యాధికి దారి తీసే లక్షణం కావచ్చు. గుండెకు రక్తం సరిగా సరఫరా కానప్పుడు వివిధ అంగాల్లో వ్యర్ధ పదార్ధాలు పేరుకుపోతాయి. దాంతో గుండె పనిచేయడం ఆగిపోతుంది. హార్ట్ ఫెయిల్యూర్‌లో దగ్గు, అలసట, బలహీనత, హార్ట్ బీట్ వేగంగా ఉండటం గమనించవచ్చు.
శరీరంలో క్రానిక్ కిడ్నీ వ్యాధి ఉంటే ఫ్లూయిడ్స్ బ్యాలెన్స్ తప్పుతాయి. దాంతో ఎడిమా సమస్య ఉత్పన్నమౌతుంది. కిడ్నీ బలహీనంగా ఉంటే వాంతులు, యూరిన్‌లో రక్తం కారడం, వికారం, అలసట, మూత్రం తక్కువగా రావడం ఉంటాయి.
లివర్‌లో ఏదైనా సమస్య ఉంటే శరీరంలో ప్రోటీన్ లోపం ఏర్పడుతుంది. రక్తంలో లిపిడ్స్ బ్యాలెన్స్ తప్పుతుంది. ఫలితంగా వాటర్ రిటెన్షన్ వల్ల చేతులు, కాళ్లలో స్వెల్లింగ్ కన్పిస్తుంది. లివర్ పాడయితే కడుపు నొప్పి, కాళ్లు, చేతులు దురద, యూరిన్ రంగు మారడం కన్పిస్తుంది.
Also read: Best 7 Seater Car: కేవలం 6 లక్షలకే బెస్ట్ 7 సీటర్ ఎంపీవీ కారు, ధర, ఫీచర్లు ఇలా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Early Signs: మీ చేతులు కాళ్లలో ఈ లక్షణాలుంటే ఆ 3 ప్రాణాంతక వ్యాధులు పొంచి ఉన్నట్టే