Narendra Modi 3.O Cabinet: నరేంద్ర మోడీ క్యాబినేట్ సెలక్షన్ సూపర్ అంటూ నెటిజన్స్ మెచ్చుకుంటున్నారు. అంతేకాదు ఐదుగురు తెలుగు వారికీ తన క్యాబినేట్ లో చోటు ఇచ్చి తెలుగు వారి మనసు దోచుకున్నారు. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. అటు ఏపీ నుంచి కింజారపు రామ్మోహన్ నాయుడు కూడా కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసారు. మరోవైపు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, నర్సాపురం ఎంపీ శ్రీనివాస్ వర్మ, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ లు సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసారు. తెలుగు రాష్ట్రాల నుంచి బీజేపీ నుంచి ముగ్గురు తెలుగు దేశం తరుపున ఇద్దరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసారు.
తొలుత ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసారు. మోడీ తర్వాత వరుసగా రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా , నితిన్ గడ్కరీ, జగత్ ప్రకాష్ నడ్డా, శివ రాజ్ సింగ్ చౌహాన్, నిర్మల సీతారామన్, జై శంకర్, మనోహర్ లాల్ ఖట్టర్, హెచ్.డీ. కుమారస్వామి, పియూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, జితిన్ రాం మాంజీ, రాజీవ్ రంజన్ సింగ్, సర్బానంద్ సోనేవాల్, డాక్టర్ వీరేంద్ర కుమార్, కింజారపు రామ్మోహన్ నాయుడు, ప్రహ్లాద్ జోషి, జ్యుయల్ ఓరమ్, గిరిరాజ్ సింగ్, అశ్వనీ వైష్ణవ్, జ్యోతిరాదిత్య సింధియా, భూపేంద్ర యాదవ్, గజేంద్ర సింగ్ షెకావత్, శ్రీమతి అన్నపూర్ణ దేవి, కిరణ్ రిజిజు, హర్దీప్ సింగ్ పూరీ, డాక్టర్ మన్సుఖ్ మాండవీయ, జి.కిషన్ రెడ్డి, చిరాగ్ పాశ్వాన్, సీఆర్ పాటిల్ సహా మొత్తంగా 30 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసారు.
రావ్ ఇంద్రజిత్ సింగ్, డాక్టర్ జితేంద్ర సింగ్, అర్జున్ రాంమేఘవాల్, ప్రతాప్ రావు గణపత్ రావు జాదవ్, జయంత్ చౌదరి ఐదుగురు స్వతంత్ర హోదాలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసారు.
జితిన్ ప్రసాద్, శ్రీపాద యశో నాయక్, పంకజ్ చౌదరి, కిషన్ పాల్, రాందాస్ అథవాలే, రాంనాథ్ ఠాకూర్, నిత్యానంద్ రాయ్, అనుప్రియా పటేల్, సోమన్న, డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని, ఎస్పీ సింగ్, శోభా కరంద్లాజే, కీర్తి వర్ధన్ సింగ్, శ్రీ వి.ఎల్. వర్మ, శంతను ఠాకూర్, సురేష్ గోపి, ఎల్. మురుగన్, అజయ్ టంకా, బండి సంజయ్ కుమార్, కమలేష్ పాశ్వాన్, భగీరథ్ చౌదరి, సతీష్ చంద్ర దూబే, సంజయ్ సేఠ్, నవనీత్ సింగ్, దుర్గా దాస్ వీకే, శ్రీమతి రక్షా నిఖిల్, సుశాంత్ మజుందార్, శ్రీమతి సావిత్రి ఠాకూర్, తోతన్ సాహూ, డాక్టర్ రాజ్ భూషణ్ చౌదరి, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, హర్ష్ మల్హోత్ర, నిమ్ము బెన్ బాబాడియా, మురళీధర్ మహోల్, జార్జ్ కురియన్, పవిత్ర్ మార్గరీటా సహా 36 కేంద్ర సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసారు.
మొత్తంగా ప్రధాన మంత్రితో కలిసి 72 మంది మంత్రలుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో వారిలో ఏడుగురు మహిళా మంత్రులుగా ఉండటం విశేషం.
ఇందులో మాజీ ముఖ్యమంత్రులైన శివరాజ్ సింగ్ చౌహాన్, మనోహర్ లాల్ ఖట్టర్, కుమారస్వామి, జితిన్ రామ్ మాంజీ, సర్బానంద్ సోనేవాల్ వంటి వారు కూడా ఉన్నారు. అటు నరేంద్ర మోదీ, రాజ్ నాథ్ సింగ్ లు ఒకపుడు ముఖ్యమంత్రులుగా పనిచేసిన సంగతి తెలిసిందే కదా. మహిళలల్లో నిర్మల సీతారామన్, అన్నపూర్ణ దేవి, కేంద్ర క్యాబినేట్ మంత్రులుగా ఇద్దరు.. అనుప్రియా పటేల్, శోభా కరంద్లాజే, రక్షా నిఖిల్, సావిత్రి ఠాకూర్, నిమ్ము బెన్ బాబడియా 5 గురు కేంద్ర సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఉన్నారు.
ముందుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 3వ కేబినేట్ లో తెలంగాణ, ఏపీ నుంచి ఏడు మంత్రి పదవులు కన్ఫామ్ అయినట్టు వార్తలు వచ్చాయి. కానీ తెలంగాణ నుంచి ఇద్దరు.. ఆంధ్ర ప్రదేశ్ నుంచి ముగ్గురుకు చోటు దక్కింది. వీరి సెలెక్షన్ చూసి తెలుగు వారు ఆనందంతో పొంగిపోతున్నారు. తెలుగు వారికి కేంద్ర క్యాబినేట్ లో సముచిత స్థానం ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఈ సారి తెలంగాణ, ఏపీ నుంచి అత్యధికంగా 29 మంది ఎంపీలు ఎన్టీయే తరుపున ఎన్నిక కావడంతో కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి బలం చేకూరింది.
అటు ఒడిషా నుంచి ధర్మేంద్ర ప్రధాన్ రాజస్థాన్ నుంచి దుష్యంత్ సింగ్, గజేంద్ర సింగ్ షెకావత్, అసోం నుంచి సర్బానంద సోనోవాల్, బిలజులీ కలితా మేధీలు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కిరణ్ రిజుజు, బిప్లవ్ దేవ్ తరుపున బెంగాల్ నుంచి శంతను ఠాకూర్.. కేరళ నుంచి సురేష్ గోపీ, తమిళనాడు నాడు అన్నామలై, తమిళ సైలకు క్యాబినేట్ బెర్త్ దక్కే అవకాశాలున్నట్టు వార్తలు వస్తున్నాయి. మొత్తంగా కీలమైన హోం, రక్షణ, ఆర్ధిక, విదేశాంగ శాఖల్లో ఆర్ధిక శాఖ మాత్రమే మార్పు ఉంటుందని సమాచారం. హోం శాఖ మంత్రిగా అమిత్ షా, రక్షణ మంత్రిగా రాజ్ నాథ్ సింగ్, విదేశాంగ శాఖ మంత్రిగా జై శంకర్ అదే శాఖల మంత్రులుగా కొనసాగనున్నారా లేదా అనేది మరికాసేపట్లో తెలియజేయనున్నారు.
Read more; Viral video: ఒరేయ్.. ఎవర్రా మీరంతా.. వర్షం బురద నీళ్లను వదలరా.. వైరల్ గా మారిన వీడియో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter
Narendra Modi 3.O Cabinet: సెలెక్షన్ సూపర్.. తెలుగు వారి మనసు దోచుకున్న నరేంద్ర మోడీ..