Shani jayanthi 2024: రేపే శనిజయంతి.. సడేసతి, ధైయా విముక్తికి ఈరోజు ఒక్కపూజ చేయండి..!

Shani jayanthi 2024: శనిదేవుడు కర్మప్రదాత అంటారు. శని దేవుడు మనం చేసే కర్మలను బట్టి ఫలాలను ఇస్తాడు. అయితే, ప్రతిఒక్కరూ జీవితంలో ఏదో ఒక దశలో శని దశను ఎదుర్కొంటారు. ఈ సమయంలో శని ధైయ, సాడేసతితో బాధపడాల్సి ఉంటుంది.
 

1 /5

శనిజయంతి ఈ ఏడాది జూన్‌ 6 గురువారం రోజు వస్తుంది. ప్రతి సంవత్సరం జ్యేష్ఠమాసం అమావాస్య రోజు శని జయంతిని జరుపుకొంటారు. ఈరోజు శనికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల శని ధైయా, సడేసతి నుంచి విముక్తి పొందవచ్చు. 

2 /5

ఈరోజు ఉదయాన్నే స్నానం చేసి శని ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకోవాలి. అక్కడ శనిభగవాణుడికి నల్లనువ్వులు సమర్పించాలి. నల్ల గుడ్డతోపాటు బంతిపూలతో పూజించాలి. ఇలా చేయడం వల్ల శనిదేవునిడి అనుగ్రహిస్తాడు.   

3 /5

శనిదేవుడికి శనిజయంతి రోజు 108 సార్లు ప్రదక్షిణ చేయాలి. ఈరోజు ఓం ప్రాణ్‌ ప్రీం ప్రాణ్‌ సః శనైశ్చరాయనమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి.  

4 /5

ఈ మంత్రాన్ని శనిజయంతి రోజు జపించడం వల్ల శని సడేసతి ,ధైయా నుండి ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు. శనిదేవుని అనుగ్రహం వల్ల జీవితంలో సమస్యలు తొలగిపోతాయి.   

5 /5

శని జయంతి రోజు ఇలా పూజించడంతోపాటు శనిచాలీసాను పఠించండి. శని దేవుడికి ఇష్టమైన ప్రసాదాన్ని సమర్పించండి. ఇలా చేయడం వల్ల సుఖఃశాంతులు ఇంట్లో వెల్లువిరుస్తాయి. (Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)