/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

Nizamabad Lok Sabha Election Result 2024: దేశ వ్యాప్తంగా బీజేపీ తీన్మార్ కు సిద్ధమవుతోంది. మూడోసారి అధికారం చేపట్టడం ఖాయం అయిపోయింది. ఈ సారి సొంతంగా మెజారిటీ సాధించడంలో విఫలమైంది. కానీ మిత్రపక్షాలతో కలిసి దాదాపు 300 సీట్లకు చేరువలో వచ్చింది. వాళ్లు చెప్పినట్టు 400 సీట్లకు దూరంగా ఉండిపోయింది. ఇక తెలంగాణలో కూడా బీజేపీ వేవ్ కనిపించింది. తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి బీజేపీ తరుపున ధర్మపురి అరవింద్ రెండోసారి విజయ కేతనం ఎగరేసారు. ఈయన తన సమీప కాంగ్రెస్ అభ్యర్ధి జీవన్ రెడ్డి చేతిలో 1,09,241 మెజారిటీతో గెలుపొందారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్ధి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి మూడో స్థానంలో నిలిచారు.

నిజమాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ (అర్బన్), నిజామాబాద్ (రూరల్), బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి ధర్మపురి అరవింద్.. అప్పటి టీఆర్ఎస్ అభ్యర్ధి కల్వకుంట్ల కవితపై 70,875 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మొత్తం పోలైన ఓట్లలో 45.22 శాతం ఓట్లతో 4,80,584 ఓట్లు పోలయ్యాయి. అటు అప్పటి టీఆర్ఎస్ అభ్యర్ధి కల్వకుంట్ల కవితకు 38.55 శాతం ఓట్లతో 4,09,709 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసిన మధుయాష్కికి 69,240 ఓట్లు పోలయ్యాయి. నోటాకు 2031 ఓట్లు పోలయ్యాయి.

1952లో ఏర్పాటు అయిన నిజామాబాద్ నియోజకవర్గంలో 2024 వరకు 18 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇందులో ఎక్కువ సార్లు కాంగ్రెస్ పార్టీనే గెలుచుకుంది.  అటు బీఆర్ఎస్ పార్టీ ఒకసారి ఈ స్థానాన్ని ఒకసారి  గెలిచింది. ఇక భారతీయ జనతా పార్టీ తరుపున 2019 ఎన్నికల్లో తొలిసారి కమలం విరబూసింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో మరోసారి నిజామాబాద్ స్థానం కాషాయ వశం అయింది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
Nizamabad Lok Sabha Election Result 2024 bjp candidate Arvind Dharmapuri again Record Victory in Nizamabad seat ta
News Source: 
Home Title: 

Nizamabad Lok Sabha Election Result 2024: నిజామాబాద్ లో  విరబూసిన అరవిందం.. మరోసారి రికార్డు విజయం..

Nizamabad Lok Sabha Election Result 2024: నిజామాబాద్ లో విరబూసిన అరవిందం.. మరోసారి రికార్డు విజయం..
Caption: 
Dharmapuri Aravind (X/Photo)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
నిజామాబాద్ లో విరబూసిన అరవిందం.. మరోసారి రికార్డు విజయం..
TA Kiran Kumar
Publish Later: 
No
Publish At: 
Tuesday, June 4, 2024 - 17:53
Created By: 
Kiran Kumar
Updated By: 
Kiran Kumar
Published By: 
Kiran Kumar
Request Count: 
13
Is Breaking News: 
No
Word Count: 
233