Chandrababu Cabinet 2024: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. తెలుగుదేశం మిత్రపక్షాలు బీజేపీ, జనసేనలు పోటీ చేసిన అన్ని స్థానాల్లో దాదాపుగా విజయం సాధించాయి. జనసేన 21 స్థానాల్లో పోటీ చేసి మొత్తం అన్ని స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక బీజేపీ 10 స్థానాల్లో పోటీ చేయగా 8 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇప్పుడు కూటమి పార్టీల్లో మంత్రివర్గంపై అంచనాలు పెరుగుతున్నాయి.
ఈ నెల 9వ తేదీన నాలుగోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే మంత్రివర్గ కూర్పుపై కసరత్తు ప్రారంభమైనట్టు సమాచారం. మొత్తం 25 మందికి అవకాశముండే మంత్రివర్గంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీల్లో ఏ పార్టీకు ఎన్నిమంత్రి పదవులనేది కీలకంగా మారింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఉప ముఖ్యమంత్రి పదవి దాదాపుగా ఖరారైంది. ఇక మరో 23 మందికి అవకాశముంటుంది. ఇందులో జనసేన నుంచి ఇద్దరు, బీజేపీ నుంచి ఇద్దరికి అవకాశం దక్కవచ్చు. బీజేపీకు రెండెందుకంటే అందుకు ప్రతిగా కేంద్రమంత్రివర్గంలో బెర్త్ ఆశించవచ్చు. అందుకే బీజేపీ నుంచి సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజుల్లో ఇద్దరికి అవకాశం దక్కవచ్చని తెలుస్తోంది.
ఇక జనసేన నుంచి నాదెండ్ల మనోహర్ పేరు ఒకటి ఖాయం కావచ్చు. మరో పేరు కొణతాల రామకృష్ణ, మండలి బుద్ధ ప్రసాద్, వరప్రసాద్‌లలో ఒకరు కావచ్చు. ఇక తెలుగుదేశం నుంచి ఆశావహుల సంఖ్య చాలా ఎక్కువే ఉంది. అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు, అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావు, వంగలపూడి అనిత, అనందరావు, పితాని సత్యనారాయణ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వేగుళ్లు జోగేశ్వరరావు, రఘురామరాజు, బొండా ఉమ, పయ్యావుల కేశవ్, చినరాజప్ప, వేమిరెడ్డి ప్రశాంతి, పరిటాల సునీత, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, గౌరు చరిత, పుట్టా సుధాకర్ యాదవ్, కాల్వ శ్రీనివాసులు, అమర్ నాధ్ రెడ్డిల పేర్లు పరిశీలనలో ఉన్నాయి.
Also read: Gorantla Buchiah Chowdary: రాజమండ్రి రూరల్ నుంచి బుచ్చయ్య చౌదరి హ్యాట్రిక్ విజయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook