Rushikonda Building: రుషికొండ జగన్ భవనం టీడీపీ స్వాధీనం, పార్టీ జెండాల ఎగురవేత

Rushikonda Building: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. కూటమి భారీ విజయంతో దూసుకుపోతోంది. లెక్కలు మారిపోయాయి. తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి నేతలు, కార్యకర్తలు సంబరాలు మొదలెట్టేశారు.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 4, 2024, 01:50 PM IST
Rushikonda Building: రుషికొండ జగన్ భవనం టీడీపీ స్వాధీనం, పార్టీ జెండాల ఎగురవేత

Rushikonda Building: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వెలువడుతున్నాయి. కూటమి పార్టీలు క్లీన్‌స్వీప్ చేస్తున్నాయి. ఇప్పటికే మూడొంతులకు పైగా సీట్లు సాధించిన కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. మొత్తం 160 సీట్లలో కూటమి ఆధిక్యం కనబరుస్తోంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి జగన్ విశాఖలో నిర్మించుకున్న భవనాన్ని తెలుగుదేశం ఆధీనంలో తెచ్చుకుంది. 

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పదవికి రాజీనామా చేయనున్నారు. తన రాజీనామాను త్వరలో గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు సమర్పించనున్నారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకు ఎదురైన పరాభవం కంటే ఘోరమైన ఓటమిని ఎదుర్కోనుంది. ఈ పరిణామాలతో విజయ సంబరాల్లో మునిగితేలుతున్న తెలుగుదేశం నేతలు, అభిమానులు మరో అడుగు ముందుకేశారు. విశాఖపట్నం రుషికొండపై వైఎస్ జగన్ నిర్మించిన పర్యాటక భవన సముదాయాన్ని తమ స్వాధీనంలో తెచ్చుకున్నారు. మరోసారి అధికారంలో వస్తే ఈ భవనం నుంచే పరిపాలన చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఎందుకంటే ఇదే పర్యాటక భవనంలో జగన్ క్యాంపు కార్యాలయం కూడా నిర్మితమైంది. ఫలితాలు వెలువడగానే తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున ఈ భవనానికి చేరుకుని టీడీపీ జెండాలు ఎగురవేశారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా వినకుండా దూసుకెళ్లారు. నేరుగా భవనంపైకెక్కి టీడీపీ జెండాలు ఎగురవేశారు. చంద్రబాబు, లోకేశ్‌కు అనుకూలంగా నినాదాలిచ్చారు. 

Also read: Gorantla Buchiah Chowdary: రాజమండ్రి రూరల్ నుంచి బుచ్చయ్య చౌదరి హ్యాట్రిక్ విజయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News