Bank Holidays in June 2024: జూన్ నెలలో బ్యాంక్ ఎన్ని రోజులు సెలవులు.. ? పూర్తి లిస్ట్ ఇదే.. ?

Bank Holidays in June 2024: మన రోజు వ్యవహారాల్లో బ్యాంక్‌ పనులు కీలకం అని చెప్పాలి. ఒక్కోసారి క్యాలెండర్ చూసుకునే తీరిక లేక బ్యాంకు వెళితే.. తీరా ఆ రోజు సెలవు ఉంటే ఉసూరు మనాల్సిందే. అలాంటి వారి కోసమే జూన్ నెల సెలవుల జాబితా ప్రకటించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.  

Written by - TA Kiran Kumar | Last Updated : May 28, 2024, 05:47 PM IST
Bank Holidays in June 2024: జూన్ నెలలో బ్యాంక్ ఎన్ని రోజులు సెలవులు.. ? పూర్తి లిస్ట్ ఇదే.. ?

Bank Holidays in June 2024: జూన్ నెలలో 5 ఆదివారాలతో పాటు.. 2వ మరియు 4వ శనివారం కలిపి మొత్తంగా 12 రోజులు బ్యాంకులకు సెలవులున్నాయి.  

జూన్ 10: గురు అర్జున్ సింగ్ పుణ్య తిథి సందర్బంగా పంజాబ్‌లో  ఈ రోజు బ్యాంకులు పనిచేయవు.  

జూన్ 14: ప్రతి యేడాది ఋతుపవనాల దినోత్సవం సందర్భంగా ఒడిషా రాష్ట్రంలో ఆ రోజు బ్యాంకులకు హాలిడే.

జూన్ 15 : యంగ్ మిజో అసోషియేషన్ డే సందర్భంగా నార్త్ ఈస్ట్ స్టేట్ మిజోరాంలో ఆ రోజు బ్యాంకులకు సెలవు.

జూన్ 17: ముస్లిములు బక్రీద్ సందర్భంగా దేశ వ్యాప్తంగా బ్యాంకులకు హాలిడే.

జూన్ 21: ఏరువాక పూర్ణిమ, వట సావిత్రి వత్రం సందర్భంగా దేశంలో మెజారిటీ రాష్ట్రాలు హాలీడే ప్రకటించాయి.

జూన్ 22: నాల్గో శనివారం కావడం బ్యాంకులకు సెలవు దినం.

వీటితో పాటు జూన్ 2, 9, 16, 23, 30న ఆదివారం కావడంతో వీకెండ్ హాలీడే ఉంటాయి. ఆయా రోజుల్లో బ్యాంకులు సెలవులు అయినా.. ఆన్ లైన్ లావాదేవీలకు ఎలాంటి ఆటంకం ఉండదు. ఏటీఎమ్, మొబైల్ యాప్స్ తో బ్యాంకు కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు. ఏదైనా అర్జంట్ పని వల్ల బ్యాంకులకు వెళ్లాల్సి వస్తే ఆయా తేదిలను గుర్తు పెట్టుకుని మరి మీ కార్యకలాపాలను సెట్ చేసుకుంటే సరిపోతుంది.

Also read: AP Elections Survey: ఏపీలో అధికారం ఎవరిది, జగన్‌కు క్లారిటీ వచ్చేసిందా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News