Viral video: ద్యావుడా.. ఈ వధువు చాలా స్మార్ట్ భయ్యా.. పీటల మీదే మొదలెట్టేసిందిగా.. వీడియో వైరల్..

Wedding viral video: పెళ్లి వేడుకలో ఒక యువతి చాలా స్మార్ట్ గా ప్రవర్తించింది. యువకుడిని తన చూపులతో డైవర్ట్ చేసింది. అతగాడు పరధ్యానంలో ఉండగా ఆ పనిని సీక్రెట్ గా చేసేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : May 26, 2024, 06:06 PM IST
  • పీటల మీద వరుడికి ఊహించని ట్విస్ట్..
  • వధువు చాలా స్మార్ట్ అంటూ కామెంట్లు పెడుతున్న నెటిజన్ లు..
Viral video: ద్యావుడా.. ఈ వధువు చాలా స్మార్ట్ భయ్యా.. పీటల మీదే మొదలెట్టేసిందిగా.. వీడియో వైరల్..

Wedding Funny video Goes Viral: సోషల్ మీడియాలో పెళ్లికి సంబంధించిన వీడియోలు తరచుగా వార్తలలో ఉంటాయి. కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే మరికొన్ని మాత్రం కాస్తంతా వెరైటీగా ఉంటాయి. కొందరు పెళ్లిళ్లలో కావాలని చేస్తారో.. లేదా పబ్లిసిటీ కోసం చేస్తారో కానీ ఆ పెళ్లి ఘటనలు కాస్త ట్రెండింగ్ లో ఉంటాయి. ఇటీవల పెళ్లిళ్లలో.. కొందరు పీటల మీద ఫన్నీగా ప్రవర్తించిన ఘటనలు వార్తలలో నిలిచాయి. కొన్నిసార్లు పెళ్లిలో.. పీటల మీద వధువులు ఫన్నీగా డ్యాన్స్ లు చేసిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇక వరుడు, వధువు పూలమాలలు వేసుకునే సమయంలో ఆసక్తికర ఘటనలు వెలుగులోకి వచ్చాయి. పీటల మీద కొన్నిసార్లు మాజీ లవర్ లు ఎంట్రీ ఇవ్వడం కూడా జరిగాయి.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Dharamveer Arya (@desi_patrkar_dharmu_official)

ఇక కొందరు పెళ్లిళ్లలో తాగి రావడం, పెళ్లికి బైక్ లు, గుర్రాలు, పల్లకీలు, క్రేన్ ఇలా వెరైటీగా వేదికమీదకు వచ్చిన ఘటనలు వార్తల్లో నిలిచాయి. ఇక వేదిక మీద వరుడు తాగి రావడంతో వధువు పెళ్లిళ్లు క్యాన్షిల్ చేసుకున్న ఘటనలు కొకొల్లలు. ఇదిలా ఉండగా.. తాజాగా, ఒక పెళ్లి వేడుక వైరల్ గా మారింది. దీనిలో ఒక వధువు ప్రవర్తించిన తీరును నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. 

పూర్తి వివరాలు..

పెళ్లివేడుక ఘనంగా జరుగుతుంది. వరమాల కార్యక్రమం కూడా అయిపోయింది. అతిథులు అందరు వచ్చి విషేస్ చెప్పి వెళ్తున్నారు. కొత్త జంట ఒకరిని మరోకరు చూసుకుంటూ, నవ్వుకుంటున్నారు. అయితే.. ఇక్కడే ఒక ఆసక్తికర ఘటన జరిగింది. కొత్త జంటకు చాలా మంది ఎవరికి తోచిన విధంగా గిఫ్ట్ లు, డబ్బులను చేతిలో ఇస్తుంటారు.  ఇదే క్రమంలో.. ఒక వ్యక్తి చేతిలో కొత్త జంటకు సపరేట్ గా డబ్బులు ఇచ్చాడు. అప్పుడు వధువు..తన డబ్బులను మాత్రం, పక్కన పెట్టుకుంది. అంతటితో ఆగకుండా వరుడి చేతిలోని డబ్బులను కూడా మెల్లగా తీసుకుంది.

వరుడు పరధ్యానంలో ఉన్నట్లు నటించాడో లేదా నా భార్యే కదా..ఎవరి దగ్గర ఉంటే ఏమౌతుందని అనుకున్నాడో కానీ.. ఏవిధంగా కూడా రెస్పాండ్ కాలేదు. ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్నిచూసిన నెటిజన్లు వావ్.. వధువు టాలెంట్ మాములుగా లేదుగా.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు పీటల మీద స్మార్ట్ పని మొదలెట్టేసిందిగా.. అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News