Bank Holiday: మే 23, 25న దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులకు సెలవు.. ఎందుకో తెలుసా?

Banks Closed on May 23: దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పబ్లిక్‌, ప్రైవేట్‌ సెక్టార్ బ్యాంకులకు ఎల్లుండి గురువారం అంటే మే 23న సెలవు దినంగా ఆర్‌బీఐ ప్రకటించింది. బ్యాంకుల్లో పనులు ఉన్న ఖాతాదారులు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతాల్లో ఈ బ్యాంకులకు సెలవు ఎందుకో తెలుసుకోండి.
 

1 /5

మే నెలలో ఎక్కువ శాతం బ్యాంకులకు సెలవులు వచ్చాయి. నిన్న ఐదవ విడత లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు ప్రకటించింది ఆర్‌బీఐ. అయితే, గురువారం మే 23న  కూడా బ్యాంకులకు సెలవు. ఈరోజు బుద్ధపూర్ణిమ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులకు సెలవు ఉంది. ఆన్‌లైన్ ద్వారా బ్యాంకింగ్‌ సేవలు యథావిధిగా కొనసాగుతాయి.  

2 /5

ఆర్‌బీఐ వివరాల ప్రకారం బుద్ధపూర్ణిమ సందర్భంగా మహారాష్ట్ర, భోపాల్, మధ్యప్రదేశ్‌, త్రిపుర, మిజోరం, ఛత్తీస్‌గఢ్‌, ఛండీఘడ్‌, ఉత్తరాఖండ్‌, అరుణచల్ ప్రదేశ్, జమ్మూ, కశ్మీర్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌, న్యూఢిల్లీ, హిమాచల్‌ ప్రదేశ్, జార్ఖంఢ్‌, అగర్తలా, ఐజ్వాల్, బెలాపూర్‌, డెహ్రాడూన్, ఇటానగర్‌, కాన్పూర్, కోలకత్తా, లక్నో, నాగ్‌పూర్, రాయ్‌పూర్, రాంచి ప్రాంతాల్లో ఉన్న బ్యాంకులకు మే 23న సెలవు దినంగా ప్రకటించారు.   

3 /5

మే లో 14 సెలవులు.. ఆర్‌బీఐ సెలవుల జాబితా ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులకు మే నెలలో మొత్తం 14 రోజులు సెలవులు వచ్చాయి. లోక్‌ సభ ఎన్నికలు 2024, రవింద్రనాథ్‌ ఠాగూర్, అక్షయ తృతీయ, బుద్ధ పూర్ణిమ రోజు కూడా బ్యాంకులకు సెలవులు రానున్నాయి.

4 /5

బుద్ధపౌర్ణమి.. బుద్ధ పూర్ణిమ ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధమతస్థులకు అత్యంత పవిత్రమైన రోజు. ఇది వైశాఖ పౌర్ణమి రోజు వస్తుంది. అందుకే దీన్ని బుద్ధపూర్ణిమ అని పిలుస్తారు. గౌతమ బుద్ధ దేవుని సంస్మారనార్థం ఈరోజు వేడుకలు జరుపుకుంటారు.

5 /5

అతని జీవితంలో చోటు చేసుకున్న ప్రత్యేక సందర్భాలు లుంబిని, బుద్ధగయా, మహాపరివర్తనం చెందినవాటికి గుర్తుగా ఈరోజు వేడుకలు జరుపుకుంటారు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )