Adilabad man gives triple talaq to first wife via whatsapp: మహిళల భద్రతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చట్టాలు తీసుకుస్తున్నాయి. ఎక్కడ ఎలాంటి అన్యాయం జరిగిన వెంటనే చర్యలు తీసుకొవాలని, బాధితులకు బాసటగా ఉండాలని ప్రభుత్వాలు పోలీసులకు సూచిస్తుంటాయి. ఇక మహిళలకు వేధింపులకు గురిఅవుతుంటే వెంటనే దగ్గరలోని పోలీసు స్టేషన్ లకు వెళ్లి ఫిర్యాదులు చేస్తుంటారు. పోలీసులు కూడా బాధితులకు అండగా ఉంటూ తప్పులు చేసిన వారిపై కేసులు నమోదు చేస్తారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఇప్పటికి కొందరు ముస్లింలు ట్రిపుల్ తలాఖ్ లు చెప్తు కట్టుకున్న వాళ్లకు నరకం చూపిస్తున్నారు.
Read more: Snakes facts: ప్రపంచంలోనే అత్యంత స్పీడ్ గా వెళ్లే పాములు.. ఇవి చాలా డెంజర్ భయ్యా.. డిటెయిల్స్ ఇవే..
ఇప్పటికే సుప్రీంకోర్టు ధర్మాసనం ట్రిపుల్ తలాఖ్ పై అనేక తీర్పులు చెప్పింది. త్రిపుల్ తలాఖ్ చెప్పడం చట్టరిత్యా నేరమని కూడా స్పష్టం చేసింది. అయిన కూడా కొందరు తీరులో మాత్రం మార్పు రావడం లేదు. ఇటీవల యూపీలో రన్నింగ్ ట్రైన్ లో తన భార్యతో గొడవ పడి ఒక వ్యక్తి తన భార్యకు త్రిపుల్ చెప్పాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన మరవక ముందే మరో ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది.
పూర్తి వివరాలు..
తెలంగాణలోని ఆదిలాబాద్ లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. అబ్దుల్ అతీక్ అనే వ్యక్తికి, జాస్మిన్ అనే మహిళతో 2017 లో పెళ్లి జరిగింది. వీరికి ఒక కూతురు కూడా ఉంది. తరచుగా గొడవలు జరగటంతో దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే అతీక్ మరో వివాహాం చేసుకున్నాడు. దీంతో మొదటి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కోర్టులో 2౦23 లో పిటిషన్ దాఖలు చేసింది. తనకు ప్రతినెల తనకు మెయింటెనెన్స్ చెల్లించాలని కోరింది. కోర్టు వారు.. మొదటి భార్య కు ప్రతినెల రూ. 7,200 రూపాయలు చెల్లించాలని తీర్పునిచ్చింది. కొన్ని నెలలు డబ్బులిచ్చిన అతీక్.. ఆ తర్వాత మరల ఇవ్వడం మానేశాడు. దీంతో మరల కోర్టుకు వెళ్లింది.
Read more: Viral Video: ఓవరాక్షన్ చేస్తే ఇట్లనే ఉంటది మరీ.. బొక్కొ బొర్లా పడిన యువకుడు.. వీడియో వైరల్..
అతీక్ ను కోర్టుకు రావాలని న్యాయస్థానం సమన్లు జారీచేంది. కోపంపెంచుకున్న అతగాడు... వాట్సాప్ లో ట్రిపుల్ తలాక్ వాయిస్ మెస్సెజ్ చేశాడు. దీంతో ఆమె బంధువులకు చెప్పి, పోలీసులుక ఫిర్యాదుచేసింది. చట్టపరంగా ట్రిపుల్ తలాక్ చెల్లదని, రంగంలోకి దిగిన పోలీసులు అతీక్ పై కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. న్యాయస్థానంలో ప్రవేశ పెట్టగా.. జడ్జీ నిందితుడు అతీక్ కు 14 రోజుల పాటు జ్యూడిషియల్ రిమాండ్ విధిస్తు ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుతం ఈ ఘటన మాత్రం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter