Most Lucky Zodiac: మే నెల కొత్త వారం లక్కీ రాశుల ఫలాలు.. ఇందులో మీ రాశి కూడా ఉందా?

Most Lucky Zodiac Signs In May New Week: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మే నెలలోని కొత్త వారం కొన్ని రాశుల వారికి అనేక రకాల ప్రయోజనాలను అందించబోతోంది. ముఖ్యంగా ఈ సమయంలో ఈ క్రింది రాశుల వారు మిశ్రమ లాభాలు పొందడమే కాకుండా కొన్ని రాశుల వారు వ్యాపారాల్లో విపరీతమైన లాభాలు పొందుతారు. అయితే ఇందులో మీ రాశి కూడా ఉందా చెక్ చేసుకోండి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : May 19, 2024, 05:24 PM IST
Most Lucky Zodiac: మే నెల కొత్త వారం లక్కీ రాశుల ఫలాలు.. ఇందులో మీ రాశి కూడా ఉందా?

 

Most Lucky Zodiac Signs In May New Week: 2024 సంవత్సరంలోని మే నెల కొత్త వారం ఆదివారం నుంచి ప్రారంభం కాబోతోంది. ఈరోజు మోహిని ఏకాదశి కూడా అంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ కొత్త వారం మే 19 నుంచి ప్రారంభమై 25వ తేదీకి ముగుస్తుంది. అయితే గ్రహ సంచారాల పరంగా చూస్తే ఈ నెల ఎంతో శుభప్రదమైందిగా భావించవచ్చు. అలాగే ఈ నెలలో కొన్ని నక్షత్రాలు కూడా సంచారం చేయబోతున్నాయి. ముఖ్యంగా ఈ వారంలో గురు శుక్ర సంయోగం వృషభ రాశిలో జరగబోతోంది. దీంతో ఈ వారం కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా మారబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ వారంలో ఏయే రాశుల వారు ఎలాంటి లాభాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకోండి.

ఈ వారం లాభాలు పొందబోయే రాశుల వారు:
మేషరాశి:

మే నెలలోని కొత్త వారంలో మేష రాశి వారు కొంత బిజీగా అవుతారు. ఈ సమయంలో జీవితంలో ఆకస్మిక మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే కొన్ని సమస్యల నుంచి కూడా సులభంగా పరిష్కారం లభిస్తుంది. ముఖ్యంగా ఆఫీసులలో ఉద్యోగాలు చేసే వారికి ఒత్తిడి తగ్గి కొంత రిలీఫ్ అయ్యేందుకు సమయం దొరుకుతుంది. ఆరోగ్యంలో స్వల్ప మెరుగుదల కనిపించడమే కాకుండా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. ఇక వ్యాపారాలు చేస్తున్నవారు ఈ సమయంలో ధైర్యంగా పెట్టుబడులు పెట్టడానికి శక్తిని పొందుతారు. మేష రాశి వారికి ఈ వారం ఎంతో అనుకూలంగా ఉంటుంది.

వృశ్చిక రాశి:
వృశ్చిక రాశి వారికి ఈ కొత్త వారం మిశ్రమ లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరు స్వీయ నియంత్రణలో ఉండడం చాలా మంచిది ఎవరికైనా వాగ్దానం చేసే ముందు తప్పకుండా ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి ఉంటుంది. దీంతో పాటు వ్యాపారాలు చేసేవారు భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టకపోవడం ఎంతో మంచిది. కుటుంబ సభ్యుల మధ్య మంచి అవగాహన లభించి కష్టసుఖాలను తెలుసుకుంటారు. అలాగే వీరు ఆహార విషయం తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో పాటు ఎక్కువగా బయట తిరగకుండా ఉండడం చాలా మంచిది.

మిధునరాశి:
మిధున రాశి వారికి మే నెలలోని కొత్త వారం కొంత బూస్ట్ ని ఇవ్వబోతోంది.. ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన వీరు సులభంగా విజయాలు సాధించే సామర్థ్యాన్ని పొందుతారు. అంతేకాకుండా ఇంట్లో కొన్ని శుభకార్యాలు కూడా జరగవచ్చు. కుటుంబ సభ్యులతో ఈ సమయంలో ఎంతో ఆనందంగా ఉంటారు. అలాగే అనారోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ముఖ్యంగా ఈ రాశి వారు పిల్లలనుంచి మంచి శుభవార్తలు వింటారు. ఇక ఉద్యోగాలు చేసే వారి విషయానికొస్తే ఈ వారం వీరికి చాలా బాగుంటుంది.

సింహ రాశి:
సింహ రాశి వారికి ఈ వారం అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ప్రేమ జీవితం గడుపుతున్న వారికి శృంగార భరితంగా ఉంటుంది. అంతేకాకుండా ఒంటరి జీవితం గడుపుతున్న వారికి ప్రేమ ప్రతిపాదనలు కూడా వస్తాయి. దీనికి కారణంగా వివాహాలు కూడా సులభంగా జరుగే ఛాన్స్ ఉంది. ఆరోగ్యం పట్ల వీరు తప్పకుండా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. సమాజంలో వీరికి గౌరవం లభించడమే కాకుండా మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు. ఇక ఉద్యోగాలు చేస్తున్న వారికి ఈ సమయంలో పురోగతి లభిస్తుంది. అలాగే ఆర్థిక లాభాలు కూడా కలుగుతాయి. ఇక కుటుంబ విషయానికి వస్తే సింహ రాశి వారికి ఈ సమయంలో మత పరమైన కార్యక్రమాలు జరుగుతాయి. దీంతోపాటు కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు కూడా వింటారు.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

కన్యా రాశి:
కన్యా రాశి వారికి మే నెలలోని కొత్త వారంలో చిన్న చిన్న సమస్యలతో పాటు ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ఈ సమయంలో వీరు మిశ్రమ లాభాలు పొందగలుగుతారు. అంతేకాకుండా కొందరి నుంచి శుభవార్తలు వినే ఛాన్స్ కూడా ఉంది. అలాగే స్నేహితులతో కలిసి వీరు విహారయాత్రలకు వెళ్తారు. దీని కారణంగా ఈ రాశి వారికి విపరీతమైన ఖర్చులు పెరగవచ్చు. అంతేకాకుండా మానసిక ఆరోగ్యం కూడా చాలావరకు మెరుగుపడుతుంది. ఇక కుటుంబ జీవితం గడుపుతున్న వారికి ఈ సమయంలో శాంతి, సంతోషాలు రెట్టింపు అవుతాయి.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News