Constipation Remedies: వేసవిలో ఈ పదార్థాలు తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్యకు చెక్‌!

Constipation Relief Tip: వేసవిలో కలిగే మలబద్ధకం సమస్యతో ఇబ్బంది పడుతున్నవారు ఈ పదార్థాలను తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 15, 2024, 12:48 PM IST
Constipation Remedies: వేసవిలో ఈ పదార్థాలు తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్యకు చెక్‌!

Constipation Relief Tip: వేసవికాలంలో మనలో చాలా మంది వివిధ సమస్యలతో బాధపడుతుంటారు. అందులో ముఖ్యంగా మలబద్ధకం, గ్యాస్‌ సమస్య ఒకటి. ఈ వేసవిలో మలబద్ధకాన్ని నివారించడానికి సహాయపడే కొన్ని అద్భుతమైన ఆహారాలు ఏంటో మనం తెలుసుకుందాం.

వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. అందులో ఈ మలబద్ధకం ఒకటి. దీని నుంచి ఉపశమనం కలగాలి అంటే కొన్నిఆరోగ్యకరమైన ఆహారపదార్థాలు తీసుకోవాలి. అందులో కొన్ని

దోసకాయలలో 96% నీరు ఉంటుంది. ఇది డీహైడ్రేషన్‌ను నివారించడానికి మలబద్ధకాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే వేసవిలో పుచ్చకాయలు తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్‌ సమస్య బారిన పడకుండా ఉంటారు. ఇందులో ఉండే ఫైబర్‌ జీర్ణవ్యవస్థను మెరుగుపరుచుతుంది. దీంతో పాటు పచ్చిఆకుకూరలు తీసుకోవడం చాలామంచిది. ఇందులో బోలెడు పోషకాలు దొరుకుతాయి. అంతేకాకుండా ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఎంతో సహాయపడుతాయి.  పచ్చిఆకుకూరలో ఎక్కువగా పాలకూర, స్పిన్నాచ్‌, చుక్కకూర వంటివి తీసుకోవడం వల్ల మలబద్ధకం తగ్గుతుంది. ఇందులో  విటమిన్‌, ఫైబర్‌, మినరల్స్‌ వంటివి ఉండటం వల్ల ఈ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. 

పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందులో ఫైబర్‌ కంటెంట్‌ పదార్థాలు జీర్ణవ్యవస్థను మెరుగుపరుచుతాయి. అందులో ముఖ్యంగా యాపిల్‌, బెర్రీలు, ఆరెంజ్‌, అరటి పండు వంటి పండ్లు ఎంతో మేలు చేస్తాయి. వీటితో పాటు చిక్కుళ్ళు తీసుకోవడం చాలా మంచిదని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు. ఇందులో ఫైబర్‌ పుష్కలంగా లభిస్తుంది. దీని వల్ల మలబద్ధకం తగ్గుతుంది. 

పండ్లు, కూరగాయలు మాత్రమే కాకుండా నట్స్‌ను తీసుకోవడం చాలామంచిది. అందులో బాదం పప్పు ఒకటి. ఇందులో ఫైబర్‌తో పాటు బోలెడు పోషకాలు ఉంటాయి. అందులో మెగ్నీషియం, విటమిన్ ఇ ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఎంతో ఉపయోగపడుతాయి. వీటితో పాటు గింజలను తీసుకోవడం చాలామంచిది వీటిలో ఫైబర్‌ ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరుచుతుంది. గింజలలో చియా విత్తనాలు, పొద్దుతిరుగుడు , గుమ్మడిగింజలు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. 

మలబద్ధం తగ్గడానికి అధిక శాతం నీరు తీసుకోవాల్సి ఉంటుంది. శరీరానికి కావాల్సి నీరు తీసుకోవడం వల్ల తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. ప్రతిరోజూ 8 గ్లాసుల నీరు త్రాగాలని లక్ష్యంగా పెట్టుకోండి. దీంతో పాటు చియా విత్తనాలు ఫైబర్, ప్రోటీన్ మరియు ఆరోగ్యకరమైన కొవ్వులకు మంచి మూలం. అవి యాంటీఆక్సిడెంట్లలో కూడా పుష్కలంగా ఉంటాయి. వాటిని ఓట్‌మీల్, స్మూతీలలో లేదా పెరుగులో జోడించవచ్చు.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News