Stomach Cancer: ఎన్నో రకాల కేన్సర్ వ్యాధులున్నాయి. వీటిలో కడుపు కేన్సర్ ప్రమాదకరమైంది. ఎందుకంటే కేన్సర్ కారణంగా సంభవించే మరణాల్లో కడుపు కేన్సర్ నాలుగో స్థానంలో నిలుస్తుంది. కడుపు కేన్సర్ గుర్తించడంలో ఆలస్యం జరగడం వల్ల చికిత్స కష్టమైపోతుంటుంది. అయితే ఇటీవల జరిగిన కొన్ని అధ్యయనాల్లో కొత్త వాస్తవాలు వెలుగు చూశాయి.
చాలామందికి మౌత్ వాష్ తెలిసే ఉంటుంది. ముఖం శుభ్రంగా ఉండేందుకు లేదా పంటి సంరక్షణకు వైద్యుల సూచన మేరకు వాడుతుంటారు. ఇప్పుడు కొత్త పరిశోధనల ప్రకారం ఈ సాధారణ మౌత్ వాష్ ద్వారా కడుపు కేన్సర్‌ను త్వరగా గుర్తించవచ్చంటున్నారు. అమెరికాలో జరిగిన డైజెస్టివ్ డిసీజెస్ వీక్ సమావేశంలో ఈ కొత్త అధ్యయనాన్ని ప్రవేశపెట్టారు. 98 శాతం ప్రజల్లో నోటిలోని బ్యాక్టీరియాను పరీక్ష చేశారు. ఇందులో 30 మందికి కడుపు కేన్సర్ ఉందని 30 మంది ప్రీ కేన్సర్ దశ ఉందని తేలింది. 38 మంది ఆరోగ్యంగా ఉన్నట్టు అర్ధమైంది. ఈ అధ్యయనం ప్రకారం కడుపు కేన్సర్ , ప్రీ కేన్సర్ రోగుల నోట్లో సేకరించిన బ్యాక్టీరియాకు ఆరోగ్యకరమైన ప్రజల బ్యాక్టీరియాకు తేడా కన్పించింది. కడుపులో మార్పు ప్రారంభం కాగానే నోటి బ్యాక్టీరియా ద్వారా ఆ తేడా తెలిసిపోతుందని అధ్యయనంలో తేలింది.
ఈ అధ్యయనం ద్వారా నోరు, కడుపులోని బ్యాక్టీరియా ఒకదానికొకటి సంబంంధం కలిగి ఉన్నాయని తేలింది. నోట్లో ఉండే బ్యాక్టీరియా దగ్వారా కడుపు పరిస్థితి ఎలా ఉందో అంచనా వేయవచ్చంటున్నారు. దీనితో భవిష్యత్తులో ఈ పరీక్షలపై మరింత అధ్యయనం చేయవచ్చు. కేన్సర్‌ను సులబంగా గుర్తించగలిగితే అంతకంటే అద్బుతం మరొకటి ఉండదు. ఈ పరిశోధనలు ప్రస్తుతం ఇంకా ప్రారంభదశలోనే ఉన్నాయి. ఇంకా కొన్ని ప్రయోగాలు చేయాల్సి ఉంది. వైద్యుల అభిప్రాయం ప్రకారం భవిష్యత్తులో నోరు కడిగే నీళ్లతో కడుపు కేన్సర్‌ను ఇట్టే గుర్తించవచ్చు.
Also read: New Maruti Swift: కొత్త మారుతి స్విఫ్ట్ లాంచ్, ఏ వేరియంట్ ధర ఎంతంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook