Padma Awards Benefits: తెలుగు సినిమా మెగాస్టార్ చిరంజీవి తాజాగా.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మ విభూషణ్ అవార్డు స్వీకరించారు. ఈ నేపథ్యంలో పద్మ అవార్డు గ్రహీతలకు ఎలాంటి సౌకర్యాలు ఉంటాయి. దేశంలో తిరిగే రైలు, విమాన ప్రయాణాలు ఉచితమా.. ? వివరాల్లోకి వెళితే..
పద్మ అవార్డులు దేశ అత్యున్నత పురస్కారాలు. అందులో భారత రత్న తర్వాత.. పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ అవార్డులున్నాయి. ఏదైనా రంగంలో అసాధారణమైన ప్రతిభ ఉన్న వారికీ ఈ అవార్డులతో కేంద్రం గౌరవిస్తూ వస్తోంది.
పద్మ అవార్డులు మన దేశంలో 1954లో ప్రారంభమైంది. ఆ తర్వాత 1977లో అధికారంలోకి వచ్చిన జనతా ప్రభుత్వం పద్మ అవార్డులపై నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో 1978, 1979లో ఈ అవార్డులు ఇవ్వలేదు.
ఆ తర్వాత పీవీ నరసింహా రావు ప్రభుత్వం 1993 నుంచి 1996 వరకు ఇవ్వలేదు. ఆ తర్వాత వాజ్‌పేయ్ గవర్నమెంట్ 1997లో పద్మ అవార్డులు ఇవ్వలేదు.
2024 యేడాది కూడా 128 మందికి పద్మ అవార్డులను కేంద్రం అందజేసింది కేంద్ర ప్రభుత్వం. అందులో ఇద్దరు తెలుగువారైనా వెంకయ్య నాయుడు, చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డులతో సత్కరించింది.
పద్మ విభూషణ్ అది ఆయా రంగాల్లో అసాధారణమైన విశిష్ట సేవలు అందించిన వారికీ ఇస్తారు. పద్మ భూషణ్ అత్యంత విశిష్ట సేవలకు ఇస్తారు. పద్మశ్రీ కూడా అసాధారణమైన ప్రతిభ ఉన్న వారికీ ఇస్తుంటారు. గవర్నమెంట్ సర్వెంట్స్ కు ఈ అవార్డులు ఇవ్వరు. వారి వ్యక్తిగత ప్రతిభ ఆధారంగా ఇవ్వొచ్చు.
పద్మ అవార్డు గ్రహీతలకు ఎలాంటి సౌకర్యాలు ఉంటాయి. డబ్బుకు సంబంధించిన ప్రోత్సహాకాలు ఉంటాయా .. ? ఇలాంటి అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి. నిజానికి పద్మ అవార్డులు ఓ గౌరవం మాత్రమే. ఈ అవార్డు వచ్చిన వారికీ ఎలాంటి నగదు, రాయితీ ఇవ్వరు.
రైలు, విమాన ప్రయాణం వాటిల్లో కూడా ఎలాంటి రాయితీ ఉండదు. ఈ అవార్డు గ్రహీతలు రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతిని కలిసే అవకాశం ఉంటుంది. పద్మ అవార్డుల్లో రాష్ట్రపతి సంతకంతో కూడిన ధృవీకరణ పత్రం ..పతకం మాత్రమే ఉంటాయి.
పద్మ అవార్డుల ప్రయోజనాల విషయానికొస్తే.. గ్రహీతలు.. ప్రభుత్వం.. మీడియా... సామాన్య ప్రజల్లో విస్తృతమైన గుర్తింపును పొందుతారు. నేషనల్ లెవల్లో ఫోకస్ అవుతారు కాబట్టి వారు చేసిన సేవలు దేశ వ్యాప్తంగా గుర్తింపుకు నోచుకుంటాయి.