Chiranjeevi Padma Vibhushan: 2024 గణతంత్య్ర దినోత్సం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చిరంజీవికి దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్‌తో గౌరవించింది. తాజాగా ఈ అవార్డు స్వీకరించేందుకు చిరు.. కుటుంబ సభ్యులతో కలిసి దిల్లీ వెళ్లారు.
కేంద్ర ప్రభుత్వం 2024 యేడాదికి గాను దేశ రెండో అత్యున్నత పద్మ విభూషణ్ అవార్డుతో మెగాస్టార్ చిరంజీవిని గౌరవించింది. గతంలో కాంగ్రెస్ పార్టీ పద్మభూషణ్‌తో గౌరవించిన సంగతి తెలిసందే కదా.
తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి అక్కినేని నాగేశ్వరరావు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తర్వాత పద్మ విభూషణ్ అవార్డు అందుకోబోతున్న మూడో వ్యక్తి చిరంజీవి.
ఇప్పటికే పద్మ అవార్డులను కొంత మందికి అవార్డు గ్రహీతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేసారు. తాజాగా ఈ గురువారం (9-5-2024)న రాష్ట్రపతి భవన్ నుంచి ఆహ్వానం రావడంతో చిరంజీవి తన కుటుంబ సభ్యులైన భార్య సురేఖ, కుమారుడు కోడలు రామ్ చరణ్, ఉపాసనలతో కలిసి ప్రత్యేక విమానంలో దిల్లీ బయలు దేరి వెళ్లారు.
చిరంజీవి సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా సినిమాలే లోకంగా బతుకుతున్నారు. ఈ ఎన్నికల్లో చిరు..బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అభ్యర్ధులకు తన మద్దతు ప్రకటించారు.
చిరంజీవి.. ప్రస్తుతం వశిష్ఠ దర్శకత్వంలో 'విశ్వంభర' సినిమా చేస్తున్నారు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ సినిమా వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది.