Beauty Tips: మీ ఇంట్లో టమాట ఉంటే చాలు.. ముఖానికి సూపర్ ఫేస్ ప్యాక్ రెడీ

Tomato Face Pack : ఎండల కారణంగా మన శరీరంతో డీ-హైడ్రేట్ అవ్వడంతో పాటు.. మన ముఖం కూడా పాడైపోతూ ఉంటుంది. అలాంటి సమయంలో మన ముఖంలోని కాంతిని తిరిగి తీసుకురావడానికి.. మన ఇంట్లోనే ఒక అద్భుతమైన ఔషధం ఉంది అని మీకు తెలుసా?

Written by - Vishnupriya Chowdhary | Last Updated : May 3, 2024, 10:33 PM IST
Beauty Tips: మీ ఇంట్లో టమాట ఉంటే చాలు.. ముఖానికి సూపర్ ఫేస్ ప్యాక్ రెడీ

Skin Care Tips : ఒకవైపు ఎండలు భగభగ మండుతున్నాయి. ఇంకోవైపు వేడి వేడి గాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ వేసవి కాలంలో బయటకు అడుగు పెట్టాలి అంటేనే కష్టంగా ఉంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే.. ఇంటి నుండి బయటకు వచ్చిన 10 నిమిషాల్లోనే.. మొహం చెమటల కారణంగా జిడ్డుగా మారుతుంది. ముఖ్యంగా ఆయిల్ స్కిన్ ఉన్నవారికి.. ముఖం ఇంకా ఎక్కువ జిడ్డుగా మారిపోతూ ఉంటుంది. 

ఇక ఉద్యోగాలకు వెళ్లాల్సిన వారి పరిస్థితి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కనీసం ఆఫీస్ కి వెళ్ళే దాకా కూడా ముఖం ఫ్రెష్ గా ఉండడం లేదు. ఎండల తాకిడికి ముఖం పొడి పారిపోవడంతో పాటు.. మొటిమలు, నల్ల మచ్చలతో ముఖం కాంతి హీనంగా మారిపోతుంది. అలాంటి సందర్భాల్లో మన ముఖంలోని కాంతిని తిరిగి తీసుకురావడానికి.. ఒక దివ్య ఔషధం ఉంది. అది ప్రతి ఒక్క ఇంట్లో ఉంటుంది. అదే టమాట. 

టమాటా లోని లికోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ మన ముఖానికి.. ఒక సన్ స్క్రీన్ లాగా కూడా ఉపయోగపడుతుంది. టమాటా వల్ల ఆరోగ్యానికి ఎన్నో ఉపయోగాలు ఉన్న సంగతి తెలిసిందే. కానీ అదే టమాటా కి ముఖాన్ని మృదువుగా, కాంతివంతంగా చేయగల శక్తి కూడా ఉంది.

టమాటా ని స్కిన్ కేర్ లో భాగంగా ఏదో విధాలుగా వాడొచ్చు. టమాటో గుజ్జు ను ముఖం మీద అప్లై చేయచ్చు. దానివల్ల మొటిమలు, నల్ల మచ్చలు చాలా త్వరగా తగ్గిపోతాయి. టమాటా గుజ్జుతో ఫేస్ ప్యాక్ చేసుకొని వేసుకోవడం వల్ల.. అందులో ఉండే విటమిన్ సి మన ముఖాన్ని వెలిగిపోయేలా చేస్తుంది.

ఇక టమాటాను క్రమం తప్పకుండా రోజు మొహానికి రాసుకోవాలి. దానివల్ల ముఖం మీద ఉన్న మృత కణాలు తొలగిపోతాయి. అంతేకాకుండా టమాటా గుజ్జు ఎక్స్ఫోలియేటర్ గా కూడా పనిచేస్తుంది. టమాటాను రెండు చెక్కలుగా కట్ చేసి, అందులో ఒక ముక్క మీద కొంచెం చక్కెర చల్లి.. దాన్ని సున్నితంగా ముఖం మీద మర్దన చేయాలి. దీనివల్ల ఆ టమాటాలో ఉండే విటమిన్ ఏ, విటమిన్ సి మన చర్మం లోపలికి వెళ్లి అందాన్ని రెట్టింపు చేస్తాయి.

అంతేకాకుండా టమాట జ్యూస్ తాగడం వల్ల కూడా ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. టమోటాలో ఉండే లక్షణాలు మనలోని రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. 

టమాటాలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ గుణాలు వృద్ధాప్య ఛాయలను కూడా నివారిస్తాయి. ముఖ్యంగా వేసవి కాలంలో టమాటాలను తినడం వల్ల కూడా.. ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. కూరల్లో టమాటా ను వేసుకోవడం లేదా.. టమాటా జ్యూస్ చేసుకుని తాగడం వల్ల కూడా ఎన్నో సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మన చర్మం కూడా యవ్వనంగా కనిపిస్తుంది.

Also Read: Washing Machine Price Down: 7 kg కేజీల సామర్థ్యం కలిగిన Whirlpool వాషింగ్‌ మెషిన్‌ కేవలం రూ.4,500కే పొందండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News