White Sesame Seeds: తెల్ల నువ్వులు ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటిని తిలలు అని కూడా పిలుస్తారు. ఇవి ప్రపంచంలోని అనేక వంటకాల్లో ఉపయోగించబడతాయి. ఇందులో ఎక్కువగా విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లతో సహా పోషకాలకు గొప్ప మూలం.ఈ తెల్ల నువ్వులు తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
తెల్ల నువ్వులతో ఆరోగ్యలాభాలు:
తెల్ల నువ్వులు తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు తొలుగుతాయి. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీని వల్ల చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించడంలో సహాయపడుతుంది. అలాగే శరీరంలోని ట్రైగ్లిజరైడ్స్‌ను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. తెల్ల నువులలో మెగ్నీషియం అధికంగా లభిస్తుంది. దీని వల్ల రక్తపోటు సమస్యలు తగ్గుతాయి. పెద్దవారిలో కలిగే ఎముకల నొప్పి, కీళ్ల నొప్పి ఇతర కండరాల నొప్పలకు కూడా ఈ తెల్ల న్వువుల ఆరోగ్యానికి మంచి చేస్తాయి. అలాగే ఎముకలను దృఢంగా, బలంగా ఉంచుతాయి.
రక్తహీనత సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ తెల్ల నువ్వులను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా స్త్రీలు ఈ తెల్ల నువ్వులను తీసుకోవడం చాలా మంచిది. ఇందులోని పోషకాలు రతుక్రమంలో పోయిన రక్తాని తిరిగి పొందవచ్చు. అంతేకాకుండా తెల్లనువ్వులలో పిండి పదార్థాలు తక్కువగా ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన కొవ్వులను అధికంగా పెంచుతాయి. అలాగే రక్తంలోని చెక్కరను నియంత్రించడంలో తోడ్పుతాయి.
మోనోపాజ్ సమయంలో హార్మోన్ బ్యాలెన్స్ చేయడంలో కూడా ఈ తెల్లనువ్వులు శరీరానికి సహాయపడుతాయి. వీటిని తీసుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారు. అంతేకాకుండా తెల్ల నువ్వులలో యాంటీఆక్సిడెంట్ల పుష్కలంగా దొరుకుతాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి శరీరాన్ని రక్షించడంలో సహాయపడతాయి. తెల్ల నువ్వులలో విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్ లు ఉంటాయి. ఇవి చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి పోరాడడంలో సహాయపడుతుంది. విటమిన్ ఇ చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో, దీంతో పాటు ముడతలు, మచ్చలు వంటి వయస్సు పెరిగే సంకేతాలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
తెల్ల నువ్వులు ప్రోటిన్, ఐరన్, జింక్ ఎక్కువగా ఉంటాయి. ఇవి జుట్టు రాలే సమస్యలను తగ్గిస్తుంది. ఇందులోని ప్రోటీన్ జుట్టుకు అవసరమైన పోషకాలను అందిస్తుంది. అంతేకాకుండా ఐరన్, ఆక్సిజన్‌ను జుట్టు కుదుళ్లకు సహాయపడుతుంది. జింక్ తల చర్మానిని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి