నేను క్షేమంగానే ఉన్నాను : లతా మంగేష్కర్

తాను అనారోగ్యంతో ఆస్పత్రిపాలైనట్టు వస్తున్న వార్తల్ని ఖండించిన లతా మంగేష్కర్

Last Updated : Dec 14, 2018, 06:26 PM IST
నేను క్షేమంగానే ఉన్నాను : లతా మంగేష్కర్

ముంబై: భారత దేశం గర్వించదగిన ప్రముఖ నేపథ్యగాయని, దాదాసాహెబ్ ఫాల్కె, భారతరత్న వంటి అత్యున్నత పురస్కారాల గ్రహీత లతా మంగేష్కర్ అస్వస్థతతో ఆస్పత్రిపాలైనట్టుగా శుక్రవారం పలు వదంతులు వ్యాపించాయి. ఈ వదంతులపై స్పందించిన లతా మంగేష్కర్.. తాను పూర్తి ఆరోగ్యంగా వున్నానని, ఆ పుకార్లను నమ్మొద్దని తెలిపారు. తాను ఇంట్లోనే నిక్షేపంగా, క్షేమంగా వున్నానని ఆమె ట్విటర్ ద్వారా వెల్లడించారు. యావత్ భారతావనిని తన గానంతో ఓలలాడించిన లతమ్మకు ఏమైందో ఏమోనని కంగారుపడిన అభిమానులు ఆమె ట్వీట్ చూసి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు.

 

Trending News