TS Speaker In Trouble: రాజ్యాంగ పదవిలో ఉన్నవారు రాజకీయ సభలు, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనరాదు. ఇక ఎన్నికల ప్రచార సభల్లో కనిపించరాదు. కానీ తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ దీన్ని బేఖాతర్ చేశారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా స్పీకర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పాల్గొనడమే కాకుండా ఒక పార్టీ గుర్తుకు ఓటేయాలని.. పలానా పార్టీ అభ్యర్థిని ఎంపీగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. స్పీకర్ తీరు వివాదాస్పదమైంది. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న స్పీకర్‌పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది.
Also Read: KCR Live: రేవంత్ రెడ్డి పెద్ద అజ్ఞాని.. నా చరిత్ర చెరిపేస్తే చెరగదు: కేసీఆర్
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీజేపీ నాయకులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌లో ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌ను బీజేపీ నాయకుడు ప్రేమేందర్ రెడ్డిని మంగళవారం ఫిర్యాదు అందించారు. నిబంధనలకు విరుద్ధంగా లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో స్పీకర్ ప్రసాద్ కుమార్ పాల్గొన్నారని తెలిపారు. స్పీకర్‌పై చర్యలు తీసుకోవాలని ఎన్నిక సంఘానికి విజ్ఞప్తి చేశారు. ఫిర్యాదు అందించిన అనంతరం ప్రేమేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
Also Read: KCR Sensation: కాంగ్రెస్‌కు భారీ షాక్.. 20 మంది 'హస్తం ఎమ్మెల్యేలు' కేసీఆర్‌తో టచ్‌లోకి
'అసెంబ్లీ స్పీకర్ పదవిలో ఉన్న గడ్డం ప్రసాద్ కుమార్ చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేశారు. ప్రచారంలో పాల్గొన్న స్పీకర్ కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డిని ఓటు వేయాలని రేవంత్ రెడ్డితో కలిసి ప్రచారం చేశారు. స్పీకర్ ప్రచారం చేసిన ఆడియో, వీడియో రికార్డ్‌లను సీఈఓ వికాస్ రాజ్‌కు అందించాం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అసత్యాలు ప్రచారం చేస్తోంది' అని ప్రేమేందర్ రెడ్డి తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter
TS Speaker: ఇరకాటంలో 'తెలంగాణ స్పీకర్'.. ఎన్నికల్లో అనూహ్య పరిణామం