Malysian Navy Choppers Crash: గాల్లో ఢీకొన్న హెలికాప్టర్లు..10 మంది దుర్మరణం.. వీడియో వైరల్..

Malysian Navy Choppers Collid:మలేషియాలో నేవీ రిహరర్సల్ వేడుకల్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రెండు హెలికాప్లర్లు గాలిలో ఒకదానికి మరోకటి బలంగా ఢీకొన్నాయి. దీంతో గాలిలో భారీగా అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలనో పది మంది వరకు చనిపోయినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : Apr 23, 2024, 11:10 AM IST
  • మలేషియాలో గాల్లో ఢీకొన్న హెలికాప్టర్లు..
  • నేవీ రిహర్సల్స్ లో ఊహించని ఘటన..
Malysian Navy Choppers Crash: గాల్లో ఢీకొన్న హెలికాప్టర్లు..10 మంది దుర్మరణం.. వీడియో వైరల్..

Malaysian Navy Choppers Collide Mid Air During Rehearsal: రాయల్ మలేషియా నేవీ వేడుకల కోసం రిహార్సల్స్ లో ఊహించని ఘటన జరిగింది. రెండు హెలికాప్టర్ లు ఒకదానికి మరోకటి బలంగా ఢీకొన్నాయి. నౌకాదళ స్థావరం ఉన్న మలేషియా పట్టణం లుముట్ సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. రెండు హెలికాప్టర్ లు ఒకదానికి మరోకటి క్రాష్ కావడం వల్ల ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. పెరాక్‌లోని లుముట్‌లో జరిగిన ప్రమాదంలో 10 మంది మరణించారని పెరాక్ ఫైర్ అండ్ రెస్క్యూ డిపార్ట్‌మెంట్ మలేషియా ఫ్రీ ప్రెస్‌కి సంస్థ ధృవీకరించింది.

 

 

"పెరాక్‌లోని మంజుంగ్‌లోని లుముట్ రాయల్ మలేషియా నేవీ స్టేడియంలో ఈఘటన జరిగింది.  హెలికాప్టర్ సంఘటనకు సంబంధించి ఉదయం 9.50 గంటలకు అత్యవసర కాల్‌ రావడంతో డిపార్ట్‌మెంట్ అప్రమత్తమైందని  సంస్థ పేర్కొంది. హెలికాప్టర్ లు రెండు కూడా బలంగా ఒకదానికి మరోకటి బలంగా ఢీకొనడంతో భారీ ప్రమాదం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున ఆ ప్రాంతంలో మంటలు,ఆకాశంలో పొగలు అలుముకున్నాయి. పోలీసులు మంటలను ఆర్పే ప్రయత్నం చేపట్టినట్లు తెలుస్తోంది. హెలికాప్లర్ ల నుంచి మృతుల మృతదేహాలను వెలికితీసే పనులు కొనసాగుతున్నాయని వారు తెలిపారు.

HOM (M503-3), Fennec (M502-6) మోడల్స్‌గా గుర్తించబడిన రెండు హెలికాప్టర్లు ఉదయం 9:32 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) ఢీకొని కూలిపోయాయని రాయల్ మలేషియన్ నేవీ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. మే 3-5 తేదీల మధ్య జరగనున్న నేవీ 90వ వార్షికోత్సవ కార్యక్రమానికి హెలికాప్టర్లు రిహార్సల్ చేస్తున్నాయని వారు తెలిపారు.

Read More: Breakups Leaves: ఉద్యోగులకు కంపెనీ బంపర్ ఆఫర్.. బ్రేకప్ అయిన వాళ్లకు అన్ లిమిటెడ్ లీవ్స్..

HOM (M503-3) హెలికాప్టర్‌లో ఏడుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్నారని, మిగిలిన ముగ్గురు ఫెన్నెక్ (M502-6)లో ఉన్నారని వారు తెలిపారు. "బాధితులందరూ సంఘటనా స్థలంలో మరణించినట్లు మలేషియా విమానసంస్థ ధృవీకరించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు దర్యాప్తు ప్యానెల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు మలేషియా నౌకాదళ అధికారులు ప్రకటించారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News