Chilkur Balaji: గరుడ ప్రసాదం ఎఫెక్ట్.. చిలుకూరుకు పొటెత్తిన భక్తులు.. భారీగా ట్రాఫిక్ జామ్..

Chilkur Balaji:చిలుకూరు వెంకటేశ్వర స్వామి ఆలయంలో సంతానంలేని మహిళలకు గరుడముద్ద ప్రసాదంగా ఇవ్వనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ ఇప్పటికే వెల్లడించారు. దీంతో ఈరోజు ఉదయం నుంచి ప్రసాదం కోసం భక్తులు పెద్దెత్తున బారులు తీరారు. రోడ్డంతా వాహానాల రద్దీతో నిండిపోయింది.  

Written by - Inamdar Paresh | Last Updated : Apr 19, 2024, 12:28 PM IST
  • చిలుకూరులో కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు..
  • గరుడ ముద్ద ప్రసాదం పంపిణీ..
Chilkur Balaji: గరుడ ప్రసాదం ఎఫెక్ట్.. చిలుకూరుకు పొటెత్తిన భక్తులు.. భారీగా ట్రాఫిక్ జామ్..

Chilkur Balaji Garuda Mudda Prasadam Distributed For Childless Womans: కలియుగ ప్రత్యేక్ష దైవం చిలుకూరు బాలాజీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తిరుపతిలో ఉన్న వెంకన్న ఎంత ఫెమసో.. హైదరబాద్ లో మొయినాబాద్ లో వెలసిన ఈ బాలాజీ కూడా అంతే ఫెమస్. ఇక్కడికి వచ్చి ఒక 11 ప్రదక్షిణ  చేసి, ఆ తర్వాత స్వామి వారికి మనస్సులోని కోరికలు కోరుకొవాలి. కోరిక నెరవేరగానే మరల వచ్చి, 111 ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకొవాలి. ఈ స్వామి వారిని భక్తులు తమ కొంగు బంగారంగా భావిస్తారు. అంతే కాకుండా ముఖ్యంగా ఈ బాలాజీని వీసా బాలాజీ అనికూడా పిలుచుకుంటారు. ముఖ్యంగా యువత విదేశాలకు వెళ్లాలనుకునే వారు ఇక్కడకు వచ్చి వీసాల కోసం మొక్కుకుంటారు. ఇక్కడకు వచ్చి వీసా గురించి మొక్కుకుని ఆ తర్వాత..తమ పనులను స్టార్ట్ చేస్వారు. దీంతో ఎలాంటి అడ్డంకులు రాకుండా.. వీసా ప్రసెస్ పూర్తిఅయిపోతుందంటూ భక్తులు నమ్ముతారు. పిల్లలు లేని వారు, పెళ్లికానీ వారు ఇక్కడకు వచ్చి ప్రత్యేకంగా మొక్కుకుంటారు..

Read More: Venomous Snakes Facts: పాముల గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా..?

ఇక్కడ ఇతర దేవాలయాల మాదిరిగా హుండీలు అస్సలు కన్పించవు. భక్తులనుకంట్రోల్ చేయడానికి ఆలయ సిబ్బంది కూడా ఉండరు. కేవలం భక్తులే తమ శక్తికొలది అక్కడి ఆలయంలో సెక్యురిటీగా కూడా సేవలు చేస్తారు. భక్తులను మరో భక్తులు మాత్రమే కంట్రోల్ చేస్తుంటారు. ఎలాంటి తోపులాట లేకుండా కన్నులారా ఆ దైవాన్ని చూసుకొనే అవకాశంను ఆలయ పూజారులు భక్తులకు ఇస్తారు. ఎక్కువగా సాంప్రదాయ దుస్తులలో రావాలంటూ ఆలయ పూజారులు భక్తులకు సూచిస్తుంటారు. ఇదిలా ఉండగా.. ఈ చిలుకూరు బాలాజీ వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.

ముఖ్యంగా ఉత్సవాలలో గరుడ ముద్దల ప్రసాదంను సంతానం లేని పిల్లలకు ప్రసాదంగా ఇస్తారు. ఇది తిన్న మహిళలకు ఆ బాలాజీ అనుగ్రహాంతో పిల్లలు పుడతారని విశ్వసిస్తారు. ఈసారి కూడా ఈరోజు (శుక్రవారం)ఏకాదశి పర్వదినం సందర్బంగా స్వామివారి ఆలయంలో గరుడ ముద్దలు ప్రసాదం పంపిణి చేయనున్నట్లు ఆలయ పూజారులు ఇప్పటికే ప్రకటించారు. దీంతో వేలాదిగా భక్తులు ఆలయానికి పొటెత్తారు. చిలుకూరు చుట్టుపక్కల ప్రదేశమంతా ట్రాఫిక్ జామ్ అయిపొయింది. దాదాపు పది కిలోమీటర్లమేర రోడ్లపై ఎక్కడిక్కడ వాహనాలు నిలిచిపోయినట్లు సమాచారం. ట్రాఫిక్ పోలీసులు ఈ మార్గంలో రావోద్దని సూచిస్తున్నారు. ట్రాఫిక్ ను కంట్రోల్ చేయడానికి నానా తంటాలు పడుతున్నారు. 

Read More: Sai Pallavi Dance: షీలా.. షీలా కి జవానీ పాటకు మెస్మరైజింగ్ స్టెప్పులు వేసిన సాయి పల్లవి.. వీడియో వైరల్..

ఉదయం నుంచి భారీగా కార్లు, టూవీలర్ ల మీద భక్తులువస్తున్నారు. దీంతో అవుటర్ రింగ్ రోడ్డు మీద కూడా ట్రాపిక్ జామ్ అయినట్లు తెలుస్తోంది. చిలుకూరు ఆలయ పూజారులు ఊహించిన దాని కంటే ఎక్కువగా భక్తులు రావడంతో ఒక్కసారిగా తీవ్ర గందరగోళం ఏర్పడింది. అంతేకాకుండా.. పోలీసులు కూడా ఎండలో ట్రాఫిక్ ను కంట్రోల్ చేయడానికి కష్టపడుతున్నారు. అంతేకాకుండా.. ఆలయ సిబ్బంది చెప్పినదానిప్రకారం బందోబస్తు ఏర్పాటు చేశామని, ఎక్కువగా భక్తులు రావడంతో కొంత ట్రాఫిక్ సమస్య ఏర్పడిందని ప్రస్తుతానికి కంట్రోల్ చేస్తునట్లు మొయినాబాద్ పోలీసులు వెల్లడించారు.  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News