Foreign Invaders: గత చరిత్రలో భారతదేశానికి అత్యంత వైభవం, మహత్యం ఉన్నాయి. భారతదేశ గత వైభవమంతా బంగారుమయం. వజ్ర వైఢూర్యాల సమాహారం. అందుకే భారతదేశంపై తరచూ విదేశీయులు దండెత్తేవారని ఇప్పటి వరకూ మనకు తెలిసిన నిజం. కానీ తాజా పరిశోధనల్లో కొత్త వాస్తవం వెలుగుచూసింది. భారతదేశంలోని ఆహ్లాదకర వాతావరణం, పరిస్థితుల కారణంగానే విదేశీయులు దండెత్తి వస్తుండేవారనే నిజం ఇది. గత 2600 ఏళ్లలో ఇండియాపై చంగీజ్ ఖాన్, హోణులు, మొహమ్మద్ గజనీ, మొహమ్మద్ గోరీ, బాబర్ వంటి విదేశీయులు దండెత్తారు.
భారత ఉపఖండంపై దాడి చేసినప్పుడు ముందుగా వ్యవసాయం అధికంగా ఉన్న ప్రాంతంలో, ఆర్ధిక వ్యవస్థ మెరుగ్గా ఉన్న ప్రాంతాలపై దృష్టి పెట్టారు.
గుహల్లో లభ్యమైన శాంపిల్స్ 10 వేల ఏళ్లకంటే పాతవి. సరైన వర్షాలు లేకపోవడం, నిర్ణీత క్రమంలో వాతావరణం లోపించడం వల్ల మధ్య ఆసియాలోని అతిపెద్ద భాగం ఎడారిగా మారింది.
ఛత్తీస్‌గఢ్‌లోని చలులు, ఏపీలోని పర్వత గుహల్లో లభించిన ఖనిజాలతో పేర్చిన ఆక్సిజన్ ఐసోటోప్‌లతో వివరాలు లభించాయి. ఇదే ఐసోటోప్ కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇరాన్, ఇరాక్‌లోని గుహల్లో కూడా లభ్యమైంది.
ఐఐటీఎం నిపుణులు నవీన్ గాంధీ నేతృత్వంలో జరిగిన అధ్యయనంలో గత 2500 ఏళ్ల జలవాయు పరిస్థితులపై పరిశీలన జరిగింది. ఇందులో కేరళకు చెందిన ట్రీ రింగ్ ఆధారిత రుజువుల ద్వారా సమీక్ష జరిగింది.
పూణేకు చెందిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రోలజీ రీసెర్చ్ వెలుగు చూసింది. ఈ అధ్యనంలో భారత ఉపఖండం, మధ్య ఆసియాలో విదేశీయుల ఆక్రమణకు సంబంధం వాతావరణంతో ఉందని తేలింది. ఎందుకంటే మధ్య ఆసియాలో ఇండియాలో ఉన్నట్టు వర్షాధార పరిస్థితులు లేవు