IPL 2024, MI vs RCB Match Highlights: ముంబై బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తన బౌలింగ్ తో ప్రత్యర్థి బ్యాటర్లను వణికిస్తున్నాడు. తన యార్కర్లు, స్లో బాల్స్, బౌన్సర్లుతో అవతలి జట్టు బ్యాట్స్ మెన్స్ ను భయపెడుతూ వికెట్లు తీస్తున్నాడు బుమ్రా. అతడి విధ్వంసం ఎలా ఉందో తెలియాలంటే నిన్న జరిగిన ఆర్సీబీ-ముంబై మ్యాచ్ చూడాల్సిందే. అతడు కేవలం 21 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఏడు వికెట్లు తేడాతో విజయం సాధించింది హార్దిక్ సేన.
చెలరేగిన బుమ్రా.. ముంబై ఘన విజయం..
వాంఖడే వేదికగా ముంబైతో జరిగిన పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ జట్టు నిర్ణీత 20 ఓవరల్లో 196 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాటర్లలో కెప్టెన్ డుఫ్లెసిస్(61), దినేష్ కార్తీక్(53 నాటౌట్), రజిత్ పటిదార్(50) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగాడు. విరాట్ కోహ్లి (3), డుప్లెసిస్ (61), మహిపాల్ లోమ్రోర్ (0), సౌరవ్ చౌహాన్ (9), విజయ్‌కుమార్ వైశాఖ్ (0) వికెట్ల తీశాడు యార్కర్ కింగ్. అనంతరం ఛేజింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్ కేవలం 15.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ముంబై బ్యాటర్లలో ఇషాన్ కిషాన్(69) మంచి ఇన్నింగ్స్ ఆడాడు. చాలా ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన సూర్యకుమార్ యాదవ్ కేవలం 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి సత్తా చాటాడు. రోహిత్ శర్మ(38) కూడా బాగానే ఆడాడు.
వైవిధ్యమే అతడి ఆయుధం..
బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి తెచ్చేందుకు రకరకాల వేరియేషన్స్ లో బౌలింగ్ చేస్తాడు జస్ప్రీత్ బుమ్రా. వైవిధ్యమైన బంతులు వేస్తూ బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేస్తాడు. బ్యాటర్ యార్కర్ వేస్తాడనుకుంటే.. మనోడు స్లో బౌల్ వేస్తాడు. ఎవరూ ఊహించని లేని విధంగా బౌలింగ్ చేస్తూ బ్యాటర్లను బోల్తా కొట్టిస్తుంటాడు బుమ్రా. ఈ ఐపీఎల్ లోనూ అదరగొడుతున్నాడు బుమ్రా. ఇప్పటి వరకు పదివికెట్లు తీసిన అతడు చాహల్ తో కలిసి అగ్రస్థానంలో కొససాగుతున్నాడు.
Boom Boom Bumrah!@Jaspritbumrah93 comes into the attack and gets the big wicket of Virat Kohli.
Live - https://t.co/7yWt2uizTf #TATAIPL #IPL2024 #MIvRCB pic.twitter.com/1QbRGjV2L0
— IndianPremierLeague (@IPL) April 11, 2024
సీక్రెట్ రివీల్ చేసిన బుమ్రా..
ఆర్సీబీతో మ్యాచ్ అనంతరం జస్ప్రీత్ బుమ్రా మాట్లాడుతూ.. 'ఎప్పుడూ యార్కర్లు వేయాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడు స్లో బంతులు కూడా వేయవలసి ఉంటుంది. ఈ ఫార్మాట్ బౌలర్లకు చాలా కష్టం. నా కెరీర్ ప్రారంభం నుంచి వైవిధ్యంగా బంతులు వేయడానికి ప్రయత్నించాను. సరిగ్గా వేయలేకపోతే.. గత వీడియోలను చూస్తూ నా బౌలింగ్ తీరును మెరుగుపరుచుకునేవాడిని'' అంటూ ఈ యార్కర్ కింగ్ చెప్పుకొచ్చాడు.
Also Read: Rohit Sharma: ఆకాశ్ అంబానీ కారులో రోహిత్ ఏం చేస్తున్నాడు.. వైరల్ అవుతున్న వీడియో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Facebook, Twitterసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి