AP Inter Result 2024 Live: ఇంటర్ ఫలితాలు విడుదల.. ఈ లింక్‌పై క్లిక్ చేయండి

AP Inter Result 2024 Live Updates: ఇంటర్ రిజల్ట్స్‌ మరికాసేపట్లో విడుదల కానున్నాయి. ఇందుకు సంబంధించి అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ bieap.apcfss.in, bie.ap.gov.inలో ఫలితాలు వెల్లడికానున్నాయి. ఇంటర్ ఫలితాల లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.  

Written by - Ashok Krindinti | Last Updated : Apr 12, 2024, 01:04 PM IST
AP Inter Result 2024 Live: ఇంటర్ ఫలితాలు విడుదల.. ఈ లింక్‌పై క్లిక్ చేయండి
Live Blog

AP Inter Result 1st and 2nd Year 2024 Live Updates: ఇంటర్మీడియట్ ఫలితాల కోసం విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు రిజల్ట్స్‌ను విడుదల చేసేందుకు ఏపీ ఇంటర్మీడియట్ విద్యామండలి సన్నాహాలు చేసింది. ఫలితాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఫస్టియర్, సెకండియర ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నారు.  తాడేపల్లిలో ఇంటర్‌ బోర్డు కార్యదర్శి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇప్పటికే జవాబు మూల్యాంకనం పూర్తి చేసిన అధికారులు.. రిజల్ట్స్‌కు సంబంధించి ఇంటర్నల్ ప్రాసెస్‌ కూడా కంప్లీట్ చేశారు. ఫలితాలను చెక్ చేసే సమయంలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఇంటర్ ఫలితాల లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.
 

12 April, 2024

  • 13:04 PM

    AP Inter Result 2024: ఇంటర్ సప్లిమెంటరీ రాసే విద్యార్థులు ఫీజును ఈ నెల 18 నుంచి 24 వరకు చెల్లించాలని అధికారులు తెలిపారు. ఫలితాలపై విద్యార్థులకు రీకౌంటింగ్, రీవెరీఫికేషన్‌కు అవకాశం కల్పించినట్లు చెప్పారు. ఈ నెల 18 నుంచి 24 వరకు తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రాక్టికల్ మే 1 నుంచి 4 వరకు ఉంటాయన్నారు. మే 24 నుంచి జూన్‌ 1వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు.

  • 11:45 AM

    AP Inter Result 2024: ఇంటర్ ఫలితాల్లో బాలికలు ఎక్కువ మంది ఉత్తీర్ణత సాధించారని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సౌరబ్ గౌర్ వెల్లడించారు. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఈ రిజల్ట్స్‌ భవిష్యత్‌పై ఎలాంటి ప్రభావం చూపించవన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు అండగా నిలవాలని సూచించారు. ఉత్తీర్ణత సాధించలేదని విద్యార్థులకు మరో అవకాశం ఉంటుందని.. సప్లిమెంటరీ, మెయిన్ ఎగ్జామ్స్‌కు తేడాలు ఏమి ఉండదన్నారు.
     

  • 11:31 AM

    AP Inter Result 2024: ఇంటర్ ఫలితాలను విద్యార్థులు http://resultsbie.ap.gov.in/ వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.

  • 11:28 AM

    AP Inter Result 2024: ఏపీ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్ష తేదీలను అధికారులు వెల్లడించారు. మే 24 నుంచి జూన్ 1 మధ్య వీటిని నిర్వహిస్తామన్నారు. త్వరలోనే పూర్తి షెడ్యూల్ వెల్లడికానుంది.

  • 11:22 AM

    AP Inter Result 2024: ఇంటర్ ఫలితాల్లో ఈసారి కూడా బాలికలే పైచేయి సాధించారు. సెకండియర్లో అమ్మాయిలు 81 శాతం, అబ్బాయిలు 75శాతం మంది పాసయ్యారు. ఫస్ట్ ఇయర్ అమ్మాయిలు 71 శాతం, అబ్బాయిలు 64శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఫస్ట్, సెకండ్ ఇయర్లో కృష్ణా జిల్లా టాప్ ప్లేస్‌లో నిలిచింది.

  • 11:10 AM

    AP Inter Result 2024: ఫస్టియర్ ఫలితాల్లో 84 శాతం ఉత్తీర్ణతతో కృష్ణాజిల్లా మొదటి స్థానంలో నిలిచింది. 

  • 11:06 AM

    AP Inter Result 2024: ఇంటర్ పరీక్షలు 9.99 లక్షల మంది రాశారు. సెకండియర్ ఫలితాల్లో 78 శాతం ఉత్తీర్ణత నమోదవ్వగా.. ఫస్టియర్ ఫలితాల్లో 67 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. 

  • 11:03 AM

    AP Inter Result 2024: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ బోర్డు కార్యదర్శి సౌరభ్ గౌర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను విడుదల చేశారు. 

  • 10:54 AM

    AP Inter Result 2024: manabadi.co.in వెబ్‌సైట్‌లో ఇలా..

    ==> ముందుగా manabadi.co.in వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి. 
    ==> AP Inter 2nd year Result 2024 అనే లింక్‌పై క్లిక్ చేయండి. 
    ==> మీ హాల్ టికెట్ నంబరు ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
    ==> మీ రిజల్ట్స్ స్క్రీన్‌పై ప్రత్యక్షం అవుతాయి. 

  • 10:46 AM

    AP Inter Result 2024: మొబైల్ యాప్స్ ద్వారా

    వివిధ మొబైల్ యాప్‌ల ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

    ==> కైజాలా మొబైల్ యాప్
    ==> APCM కనెక్ట్
    ==> AP ఫైబర్ టీవీ
    ==> పీపుల్స్ ఫస్ట్ మొబైల్ యాప్

  • 10:44 AM

    AP Inter Result 2024: ఎస్‌ఎంఎస్ ద్వారా ఇలా..

    ==> APGEN2 (స్పేస్) రోల్ నంబర్‌ని టైప్ చేయండి
    ==> 5626 నంబరుకు మెసేజ్ పంపించండి.
    ==> ఇంటర్ రిజల్ట్ మీ నంబరుకు వచ్చేస్తాయి.

     

  • 09:57 AM

    AP Inter Result 2024: 
    ==> అధికారిక వెబ్‌సైట్ bieap.apcfss.in, bie.ap.gov.in  ఓపెన్ చేయండి.
    ==> ఇంటర్ రిజల్ట్స్ లింక్‌పై క్లిక్ చేయండి.
    ==> హాల్ టికెట్ నంబరును ఎంటర్‌ చేయండి.
    ==> మీ ఫలితాలను చెక్ చేసుకుని.. భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్ అవుట్ తీసుకోండి.

  • 09:55 AM

    AP Inter Result 2024: మొత్తం 10,52,673 మంది విద్యార్ధులు పరీక్షలకు అప్లై చేసుకోగా.. వీరిలో ఫస్టియర్‌ విద్యార్ధులు 5,17,617 మంది, సెకండియర్‌ విద్యార్ధులు 5,35,056 మంది ఉన్నారు. వీరిలో 52,900 మంది పరీక్షలకు హాజరు కాలేదు.
     

Trending News