AP SSC Exam Results: చదువుకుని పరీక్ష రాయాల్సి ఉండగా.. కొందరు విద్యార్థులు వింత వింత సమాధానాలు రాస్తుంటారు. మరికొందరు జవాబుపత్రాల్లో డబ్బులు పెట్టడం.. తమ దీన పరిస్థితి వివరించి పాస్ చేయండి అంటూ విజ్ఞప్తులు చేస్తుంటారు. కానీ ఒక విద్యార్థి విన్నవించడం కాదు జవాబుపత్రాలు దిద్దే సార్‌కు ఏకంగా వార్నింగ్ ఇచ్చారు. మార్కులు వేయకుండా చేతబడి చేయిస్తా అని హెచ్చరించాడు. విద్యార్థి వార్నింగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Also Read: Candidate Kiss: ఎంపీ అభ్యర్థి అత్యుత్సాహం.. ప్రచారంలో యువతి బుగ్గపై ముద్దు
ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి వార్షిక పరీక్షలు ముగిసిన విషయం తెలిసిందే. విద్యార్థుల జవాబుపత్రాల మూల్యంకనం ప్రారంభమైంది. మూల్యంకనం చేస్తున్న సమయంలో ఒక ఉపాధ్యాయుడికి వింత ఎదురైంది. పేపర్ దిద్దే సమయంలో విద్యార్థి రాసిన సందేశం చూసి ఆశ్చర్యపోయారు. 'నాకు మార్కులు వేయకపోతే.. మా తాత చేత చేతబడి చేయిస్తా' అని జవాబుపత్రంలో రాసి సార్‌కు వార్నింగ్ ఇచ్చారు.
Also Read: Condom Samosa: సమోసలో కండోమ్‌లు, రాళ్లు, గుట్కాలు.. కారణం తెలిస్తే నోరెళ్లబెడతారు
బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనం చేస్తున్నారు. తెలుగు పరీక్షకు సంబంధించి 'రామాయణం ప్రాశస్త్యం గురించి వివరించండి' అనే వచ్చింది. ఈ ప్రశ్నకు ఒక విద్యార్థి సరైన సమాధానం రాయలేదు. మార్కులు వేయకపోతే చేతబడి చేయిస్తా అని రాయడంతో ఉపాధ్యాయురాలు అవాక్కయ్యారు. వెంటనే ఆ జవాబు పత్రాన్ని ఉన్నత అధికారులకు చూపించారు. ఈ వార్త ఆ నోట ఈ నోట పాకి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇదంతా సరే కానీ ఆ విద్యార్థి పరీక్ష మాత్రం బాగా రాశాడు. ఆ విద్యార్థికి వందకు 70 మార్కులు వచ్చాయి. విద్యార్థి ఎక్కువ మార్కులు సాధించడం కోసం ఇలా రాశాడని తెలుస్తోంది. ప్రస్తుతం గ్రేడ్, ర్యాంకులతోనే పని కావడంతో 'తెలుగు'లో అత్యధిక మార్కుల కోసం ఇలా సార్‌కు జవాబుపత్రంలో వార్నింగ్ ఇచ్చినట్లు భావించవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter