Nightclub Fire: నైట్‌క్లబ్‌లో ఘోర విషాదం.. అగ్నికీలలు చెలరేగి 29 మంది దుర్మరణం

Istanbul Nightclub Fire Accident: వేసవి వేళ మరో ఘోర ప్రమాదం సంభవించింది. నైట్‌క్లబ్‌లో అకస్మాత్తుగా చెలరేగిన ప్రమాదంతో 29 మంది మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Apr 2, 2024, 10:34 PM IST
Nightclub Fire: నైట్‌క్లబ్‌లో ఘోర విషాదం.. అగ్నికీలలు చెలరేగి 29 మంది దుర్మరణం

Nightclub Fire: వేసవికాలంలో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతూ భూమి నిప్పుల కొలిమిగా మారుతోంది. ఎండలు తీవ్ర రూపం దాల్చుతుండడంతో అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఓ నైట్‌క్లబ్‌లో అగ్నిప్రమాదం సంభవించి 29 మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో మరికొందరు గాయపడ్డారు. వారంతా ఆస్పత్రుల్లో కొనప్రాణాలతో కొట్టుకుంటున్నారు. ఈ ఘోర విషాద సంఘటన ఇస్తాంబుల్‌ దేశంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదానికి కారణం భవన యాజమాన్యం నిర్లక్ష్యమేనని తెలిసింది.

Also Read: Fire Accident: బాత్రూమ్‌లో చిక్కుకున్న అక్కాచెల్లెళ్లు.. తలుపులు పగులగొట్టి కాపాడినా కన్నీరే!

 

బెసిక్తాస్‌ జిల్లా గేరెట్టెపే ప్రాంతంలో 16 అంతస్తుల భవనం ఉంది. ఈ భవనం పునాది భాగంలో అంటే గ్రౌండ్‌ ఫ్లోర్‌లో మాస్క్యూరైడ్‌ అనే నైట్‌ క్లబ్‌ ఉంది. ఈ క్లబ్‌లో ఇటీవల మరమ్మతు పనులు చేస్తున్నారు. క్లబ్‌కు అదనపు హంగులు అందిస్తున్నారు. పనులు జరుగుతున్న సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు ఆ ఫ్లోర్‌ మొత్తం వ్యాపించడంతో పనులు చేస్తున్న కార్మికులతోపాటు క్లబ్‌ సిబ్బంది మంటల్లో చిక్కుకున్నారు. కొందరు ఆ మంటల్లో చిక్కుకుని కాలి బూడిదవగా.. మరికొందరు మంటలు, పొగలకు తాళలేక కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో వారు మృతిచెందారు.

Also Read: Fire Accident: దంచికొడుతున్న ఎండలు.. కాలిబూడిదైన రూ.10 కోట్ల ఆహార పదార్థాలు

సమాచారం అందుకున్న వెంటనే అక్కడి స్థానిక పోలీస్‌ యంత్రాంగంతోపాటు అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. మంటలను అదుపులోకి ఆర్పుతూ ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు భద్రతా బలగాలు తీవ్రంగా శ్రమించాయి. ప్రమాదానికి గురయిన వారిని కాపాడేందుకు శాయశక్తులా కృషి చేశారు. ప్రమాదం నుంచి కొందరిని కాపాడారు. ప్రమాదం విషయమై అక్కడి గవర్నర్‌ దావత్‌ గల్‌ స్పందించారు. 'ప్రమాదంలో మరణాల సంఖ్య 29కి చేరాయి' అని ప్రకటించారు.  సంఘటన స్థలాన్ని అక్కడి మంత్రి ఇల్మాజ్‌ టంక్‌, స్థానిక మేయర్‌ ఎక్రమ్‌ ఇమామోగ్లు పరిశీలించారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. కాగా ఈ ఘోర విషాద సంఘటన జరగడానికి కారణాలేమిటనేవి భద్రతా బలగాలు తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం వేసవి కావడంతోపాటు మరమ్మతు పనులు చేపడుతున్న సమయంలో మంటలు చెలరేగి ఉంటాయని భావిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News