Indian Air Force: చైనా-పాక్‌కు దీటైన సమాధానమిచ్చే వాయుసేన అభ్యాసనం ప్రారంభం

ఇండియన్ ఎయిర్‌‌ఫోర్స్ ఆధ్వర్యంలో 10 రోజుల విన్యాసాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకూ ఇదే అతిపెద్ద విన్యాస కార్యక్రమం. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన లడాక్ నుంచి అండమాన్ వరకూ , రాజస్థాన్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకూ ప్రతి ఎయిర్‌బేస్ ఇందులో పాల్గొంటోంది. 

Indian Air Force: ఇండియన్ ఎయిర్‌‌ఫోర్స్ ఆధ్వర్యంలో 10 రోజుల విన్యాసాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకూ ఇదే అతిపెద్ద విన్యాస కార్యక్రమం. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన లడాక్ నుంచి అండమాన్ వరకూ , రాజస్థాన్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకూ ప్రతి ఎయిర్‌బేస్ ఇందులో పాల్గొంటోంది. 

1 /6

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైందిగా భావించే ఎస్ 400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌కు చెందిన రెండు స్క్వాడ్రన్లను చైనా వైమానిక స్థావరాలు లక్ష్యంగా చేసుకునే ప్రాంతాల్లో మొహరించారు. 

2 /6

చైనా గత మూడేళ్లలో టిబెట్‌లో తన ఎయిర్‌ఫోర్స్ దళాలను బలోపేతం చేసింది. కొత్త ఎయిర్‌బేస్, హెలీపోర్ట్ నిర్మించింది. పాత ఎయిర్‌బేస్ సామర్ధ్యాన్ని పెంచింది. ఇండియా కూడా బోర్డర్‌లో తన సామర్ధ్యాన్ని పెంచింది. 

3 /6

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ గత ఏడాది రాఫెల్, సుఖోయ్ జెట్స్ నుంచి వేలాది కిలోమీటర్ల ఎత్తులో హిందూ మహాసముద్రంలో దాడి చేసే విన్యాసాలు నిర్వహించింది. 

4 /6

పోక్రాన్‌లో ప్రత్యర్దికి చెందిన వేర్వేరు స్థావరాలపై దాడి చేసేందుకు వేర్వేరు రకాల ఆయుధాలను ఉపయోగించారు. ఇప్పుడు నిర్వహిస్తున్న గగన్‌శక్తి స్తాయిలో ఈ వాయు శక్తి జరగలేదు. ఈ ఏడాది ఆగస్టు-సెప్టెంబర్ నెలల్లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ మరో అభ్యయనం చేయనుంది.

5 /6

అన్ని ప్రాంతాల్లో అన్ని రకాల వాతావరణంలో యుద్ధం చేసే సామర్ధ్యం కలిగి ఉండేందుకు ఈ అభ్యయనం నిర్వహిస్తోంది. ఫిబ్రవరిలో పోక్రాన్‌లో వాయ శక్తి అభ్యయనం నిర్వహించింది. ఇందులో ప్రత్యర్ధిపై యుద్ధం చేసే సామర్ధ్యంతో ప్రదర్శన జరిగింది. ఇందులో రాఫెల్, మిస్సైల్స్ కూడా ఉపయోగించారు.

6 /6

ఏప్రిల్ 1 అంటే ఇవాళ్టి నుంచి పదిరోజులు ఏప్రిల్ 10 వరకూ గగన్‌శక్తి 2024 ద్వారా ఒకేసారి రెండు యుద్ధాలు చైనా, పాకిస్తాన్‌ను తట్టుకునేలా విన్యాసాలు ప్రారంభించింది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన అన్ని ఫైటర్ జెట్స్, విమానాలు, హెలీక్రాఫ్ట్స్ , ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, , రాడార్ స్టేషన్, మిస్లైల్ బేస్ పాల్గొంటాయి.  రాఫెల్, లడాకూ హెలీక్రాఫ్ట్ , అపాచీ కూడా పాల్గొనబోతున్నాయి.