గజ తుపాను ఎఫెక్ట్: నెల్లూరులో భారీగా ఎగసిపడుతున్న సముద్రపు అలలు, భయాందోళనలో స్థానికులు

                          

Last Updated : Nov 15, 2018, 01:24 PM IST
గజ తుపాను ఎఫెక్ట్: నెల్లూరులో భారీగా ఎగసిపడుతున్న సముద్రపు అలలు, భయాందోళనలో స్థానికులు

గజ తుపాను వాయు వేగంతో దూసుకొస్తోంది. ప్రస్తుతం అది చెన్నై తీరానికి 300 కి.మీ దూరంగా కేంద్రీకృతమై ఉంది. సాయత్రానికల్లా తీరం దాటే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీని ప్రభావం దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాపై కూడా పడనుంది. ముఖ్యంగా చెన్నైపట్నానికి సమీపంలో ఉన్న నెల్లూరు జిల్లాలో తీవ్రత ఎక్కవగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.  

ప్రస్తుతం తుపాను ప్రభావం వల్ల నెల్లూరులో సముద్రం 5 మీటర్లు ముందుకు వచ్చింది...అలలు భారీ స్థాయిలో ఎగసిపడుతున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంతాల్లో భారీగా ఈదురుగాలులు వీస్తున్నండంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

తుఫాను ప్రభావం వల్ల దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. అయితే, ఈ తుఫాన్ ప్రభావం తెలంగాణపై అంతగా కనిపించబోదని, తెలంగాణలో వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టంచేశారు. ఇదిలా ఉండగా తుఫాను హెచ్చరికలు నేపథ్యంలో ఏపీ సర్కార్ అప్రమత్తమైంది. తుఫాను ఎదుర్కొనేందుకు అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల్లో హెల్ప్ లైన్లు ఏర్పాట్లు చేశారు.
 

Trending News