Realme 12X: ప్రముఖ చైనా మొబైల్ కంపెనీ Realme నుంచి Realme 12X 5G త్వరలో ఇండియాలో లాంచ్ కానుంది. ఏప్రిల్ 2వ తేదీ మద్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్ భారతీయ మార్కెట్లో ఎంట్రీ ఇవ్వనుంది. ఇప్పటికే రియల్ మి నుంచి విడుదలైన నార్జో 70 ప్రో 5జి స్మార్ట్‌ఫోన్ అందర్నీ ఆకట్టుకుంటోంది. ఈ ఫోన్ ధర ఎంత ఉంటుంది, ఎలాంటి ఫీచర్లు ఉన్నాయనే వివరాలు మీ కోసం..
ఇదొక ఎంట్రీ లెవెల్ స్మార్ట్‌ఫోన్. ఇందులో అడ్వాన్స్డ్ విసి కూలింగ్ టెక్నాలజీ, డైనమిక్ బటన్, ఎయిర్ గెశ్చర్ సౌకర్యాలుంటాయి. సర్క్యులర్ కెమేరా మాడ్యూల్ ఉంటుంది. త్రిపుల్ కమెరా సెటప్ ఉన్నట్టు ఇప్పటికే విడుదలైన ఫోటోల్ని బట్టి అంచనా వేయవచ్చు. కెమేరా ఫీచర్లు పూర్తి స్థాయిలో తెలియలేదు. ఇందులో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో డిస్ప్లే ఉంటుంది. 6 ఎన్ఎం 5జి చిప్సెట్ ఉంటుంది. ఈ విభాగంలోని డ్యూయల్ స్పీకర్లు కలిగిన స్మార్ట్‌ఫోన్ రియల్‌మి 12 ఎక్స్ మాత్రమే.
రియల్‌మి 12ఎక్స్ 5జి స్మార్ట్పోన్లో 45 వాట్స్ సూపర్ వూక్ చార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉంటుంది. 45 వాట్స్ సూపర్ ఫాస్ట్ చార్జింగ్ కావడంతో కేవలం 30 నిమిషాల్లో 0-50 శాతం ఛార్జింగ్ అవుతుంది.
రియల్‌మి 12 ఎక్స్ స్మార్ట్‌ఫోన్ ఎంట్రీ లెవెల్ కాబట్టి ధర తక్కువే ఉంటుందని అంచనా ఉంది. గత ఏడాది లాంచ్ అయిన రియల్‌మి 11 ఎక్స్ 5జి ధర కేవలం 12,999 రూపాయలుగా ఉంది. ఇప్పుడీ ఫోన్ కూడా ఇంచుమించు అదే ధరకు అందుబాటులో ఉండవచ్చు.
Also read: Telegram New Feature: టెలీగ్రామ్‌లో కొత్త ఫీచర్, వాట్సప్ చాట్ కూడా బదిలీ చేసుకోవచ్చు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook